Begin typing your search above and press return to search.

కాస్ట్ రెలిజియన్ మించి ఒకటి ఉంటుందని చెప్పే సినిమా..!

మ్యాడ్ తో మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నార్నే నితిన్ సెకండ్ అటెంప్ట్ గా చేసిన సినిమా ఆయ్.

By:  Tupaki Desk   |   14 Aug 2024 4:41 AM GMT
కాస్ట్ రెలిజియన్ మించి ఒకటి ఉంటుందని చెప్పే సినిమా..!
X

నార్నే నితిన్ హీరోగా అంజి డైరెక్షన్ లో బన్నీ వాసు నిర్మాతగా వస్తున్న సినిమా ఆయ్. గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ కు అల్లు అరవింద్, అనుదీప్ గెస్టులుగా వచ్చారు. మ్యాడ్ తో మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నార్నే నితిన్ సెకండ్ అటెంప్ట్ గా చేసిన సినిమా ఆయ్.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నార్నే నితిన్ మాట్లాడుతూ.. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా డైరెక్టర్ అంజి సినిమా కోసం ఏదేదో చేయించారు. అవుట్ డోర్ షూటింగ్ లో మొత్తం ట్యాన్ అయిపోయాం. రికవరీ అవ్వడానికి రెండు నెలలు పట్టింది అన్నారు నార్నే నితిన్. ఈ సినిమా నిర్మాతలు బన్నీ వాసు, విద్య సినిమాను చాలా పర్సనల్ గా తీసుకున్నారు. నిర్మాత అంటే 2,3 గంటలు వచ్చి వెళ్తారని అనుకుంటే ఈ సినిమా కోసం రోజంతా మాతో ఉన్నారు బన్నీ వాసు. సినిమా కోసం నిర్మాతగా అంత కష్టపడిన బన్నీ వాసు గారికి థాంక్స్ అన్నారు నార్నే నితిన్.

ఆయ్ సినిమా ట్రైలర్ లాంచ్ కి పిఠాపురం వెళ్లాం. అది కూడా సడెన్ గా చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 3 కి లేచి ఫ్లైట్ లో రాజమండ్రి వెళ్లి.. అక్కడ నుంచి పిఠాపురం వెళ్లి మళ్లీ అక్కడ నుంచి రాజమండ్రి వచ్చాం. భోజనాల గురించి అడిగితే విందు భోజనం అన్నారు చూస్తే ఎయిర్ పోర్ట్ ముందు కార్ ఆపి చేతిలో ప్లేట్ పెట్టి విందు భోజనం అన్నారు. అదంతా చాలా సరదాగా జరిగిందని చెప్పుకొచ్చారు నార్నే నితిన్.

ఇక అల్లు అరవింద్ గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యుండి తనకు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడారు. ముందు సరదాగా మీటింగ్ జరిగింది. ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ సమీర్ చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మ్యూజిక్ కూడా బాగా కుదిరిందని అన్నారు నార్నే నితిన్. ఆగష్టు 15న ఆయ్ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. కాస్ట్ రెలిజియన్ మించి ఒకటి ఉంటుంది అదే ఫ్రెండ్ షిప్ సినిమా తప్పకుండా అందరు చూస్తారని ఆశిస్తున్నా అంటూ మాట్లాడారు నార్నే నితిన్.