Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో సినిమా.. బామ్మర్ది ఏమన్నాడంటే..

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఇప్పటికే మ్యాడ్ మూవీ హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   20 July 2024 5:15 AM GMT
ఎన్టీఆర్ తో సినిమా.. బామ్మర్ది ఏమన్నాడంటే..
X

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఇప్పటికే మ్యాడ్ మూవీ హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సక్సెస్ అందుకున్నాడు. నిజానికి మ్యాడ్ కంటే ముందు నార్నె నితిన్ రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు. అయితే అవి మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మ్యాడ్ మాత్రం నార్నె నితిన్ కి గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది. దీని తర్వాత ఆయ్ సినిమాతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రావడానికి నార్నె నితిన్ సిద్ధం అవుతున్నాడు.

గోదావరి బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. బన్నీ వాస్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జర్నలిస్టులతో సినిమా విశేషాలని చిత్ర యూనిట్ పంచుకున్నారు. ఆయ్ మూవీలో నార్నె నితిన్ కి మంచి కామెడీ పండించే క్యారెక్టర్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులకి చేరువ అయ్యాయి.

ఇదిలా ఉంటే మీడియా మీట్ లో నార్నె నితిన్ ని ఉద్దేశించి జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మీరు ఎప్పుడు సినిమా చేస్తారని ప్రశ్నించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకుంటే నా స్థాయి చాలా చిన్నదని నార్నె నితిన్ చెప్పుకొచ్చాడు. దేవర సినిమాలో రీసెంట్ గా వచ్చిన సాంగ్ లో దేవర ముందు నువ్వెంత అనే లైన్ ని గుర్తుచేశారు. ఆయన ముందు నేను చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు.

అలాగే మీ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటాయని, డాన్స్ ఎన్టీఆర్ తరహాలో ఉంటుందని సదరు జర్నలిస్ట్ నార్నె నితిన్ కి తెలియజేశారు. ఈ అభినందనపై నితిన్ థాంక్యూ చెప్పాడు. బామ్మర్ది హీరోగా అతనే సొంతంగా ఎదగాలని ఎన్టీఆర్ కూడా కోరుకుంటున్నాడు. అందుకే అతని సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ నితిన్ ని తీసుకునే ప్రయత్నం తారక్ చేయరనేది ఆయన అభిమానుల మాట.

ఇదిలా ఉంటే ఆయ్ సినిమాతో సక్సెస్ అందుకుంటే నార్నె నితిన్ క్రేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నితిన్ లైన్ అప్ లో మరో రెండు, మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. హీరోగా అతను ఎలాంటి కథలతో కెరియర్ బిల్డ్ చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.