Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బామ్మర్ది.. అందరిలా కాకుండా..

తారక్ కాస్త హెల్ప్ చేసినా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కానీ అది ప్రతీ సినిమాకు హెల్ప్ అవ్వదు

By:  Tupaki Desk   |   16 Aug 2024 4:30 PM GMT
ఎన్టీఆర్ బామ్మర్ది.. అందరిలా కాకుండా..
X

నార్ని నితిన్, తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల అడుగుపెట్టిన యంగ్ హీరో. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా తనదైన శైలిలో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అతను ఎన్టీఆర్ బామ్మర్ది కావడం వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అతను ప్రత్యక్షంగా బావ నీడను కోరుకోలేదు. తారక్ కాస్త హెల్ప్ చేసినా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. కానీ అది ప్రతీ సినిమాకు హెల్ప్ అవ్వదు.

సోలో కష్టంతో ఆడియెన్స్ ను కంటెంట్ తో మెప్పించగలిగితేనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఈ లైన్ ను నితిన్ మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా 'మ్యాడ్' ద్వారా యువతలో మంచి గుర్తింపు పొందిన నితిన్, తన కెరీర్‌లో తొలి అడుగులు విజయవంతంగా వేసినట్లే కనిపిస్తున్నాడు.

సినిమాల ఎంపిక విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. 'మ్యాడ్' తర్వాత, అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా మంది అతను సోలో హీరోగా నటించడానికి ప్రయత్నిస్తాడని అనుకున్నారు. కానీ అతను అందరి అంచనాలకు భిన్నంగా, 'ఆయ్' అనే సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డాడు. ఈ సినిమాలో ఇతర క్యారెక్టర్స్ హీరోకు దాదాపు సమానంగా ఉంటాయి. అయినప్పటికీ, కథపై నమ్మకంతో నితిన్ ముందుకు వెళ్లడం చాలా తెలివైన నిర్ణయం అని చెప్పాలి.

'ఆయ్' సినిమాకు తొలి రోజు థియేటర్ల వద్ద పోటీ ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా వసూళ్లు రాలేదు. థియేటర్స్ కూడా తక్కువగానే వచ్చాయి. ఇక ప్రేక్షకులలో మంచి టాక్ రావడంతో శుక్రవారం నుండి థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో మరిన్ని థియేటర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా నితిన్ కు అన్ని విధాలా కలిసొచ్చింది. అతని నటనలో, డాన్సుల్లో కూడా చాలా మెరుగుదల కనిపించింది.

ఇప్పటికే తన కెరీర్‌లో రెండు హిట్లు సాధించడం మామూలు విషయం కాదు. ఈ రెండు విజయాల తర్వాత, నితిన్ మరింత ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో 'మ్యాడ్ 2' సినిమా ఉంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్ల, నితిన్ తన మూడో సినిమా విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకోవాలి. సోలో హీరోగా కాకుండా, మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడం ద్వారా నితిన్ యువ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవచ్చు. ప్రస్తుతం అతని చేతిలో ఐదు లేదా ఆరు కథలు ఉన్నాయని తెలుస్తోంది.