హేమ కమిటీ దెబ్బకి అక్కడా ఓ కమిటీ!
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ మహిళల రక్షణని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 8 Sep 2024 7:30 PM GMTజస్టిస్ హేమ కమిటీలు లాంటివి ఇతర పరిశ్రమల్లోనూ రావాలి అన్న డిమాండ్ తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడ, కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ప్రభుత్వాలు ఇలాంటి కమిటీలు తీసుకురావాలి అన్న అంశాన్ని లేవనేత్తారు. ఈ నేపథ్యంలో తాజాగా నడిగర్ సంఘం మహిళలపై వేధింపుల వ్యవహారంలో చర్యలకు సిద్దమైంది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ మహిళల రక్షణని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విశాఖ కమిటీ సూచనల మేరకు నటీనటులు కోసం ఎస్ ఐఏఏ-జీఎస్ ఐససీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి రోహిణి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారు. సుహాసిని, ఖుష్బూ కీలక సభ్యులగా ఉంటారు. అలాగే ఓ న్యాయవాదిని కూడా నడిగర్ సంఘం నియమించింది. విశాఖ కమిటీ తో ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. ఏ నటి అయినా లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తమని సంప్రదించాలన్నారు.
అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పిలిపించి పరిష్కారం చూపుతామన్నారు. వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంత మంది కించ పరిచే విధంగా మాట్లాడుతు న్నారన్నారు. పరిశ్రమకు సంబంధించిన ఎవరైనా సరే సమస్యలుంటే తమని సంప్రదించాలన్నారు.
మహిళల రక్షణకు నడిగర్ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని..ఎలాంటి విషయాన్ని అయినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అయితే ఈ కమిటీ కేవలం నడిగర్ సంఘం వేసిందని గుర్తించాలి. ఈ కమిటీకి- ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం నియమించే కమిటీలో రిటైర్డ్ జడ్డ్ లు అధ్యక్షులుగా ఉంటారు. నాజర్ నియమించిన లాంటి కమిటీలు టాలీవుడ్ లోనూ ఉన్న సంగతి తెలిసిందే.