Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌ కొత్త రూల్స్‌పై ప‌వ‌న్ కౌంట‌ర్‌కు నాజ‌ర్ జ‌వాబు

అయితే ఈ వ్యాఖ్య‌ల‌ ను తమిళనాడు నడిగరసంఘం అధ్యక్షుడిగా ఉన్న తమిళ నటుడు నాజర్ ఖండించారు.

By:  Tupaki Desk   |   27 July 2023 3:39 PM GMT
కోలీవుడ్‌ కొత్త రూల్స్‌పై ప‌వ‌న్ కౌంట‌ర్‌కు నాజ‌ర్ జ‌వాబు
X

ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) జారీ చేసిన కొత్త నిబంధ‌న‌ల‌తో కోలీవుడ్‌ లో తమిళ ఆర్టిస్టులు మాత్రమే న‌టించాల‌ ని ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల ఆర్టిస్టుల‌ కు అవ‌కాశాలు క‌ల్పించ‌ర‌ని ప్ర‌చార‌మవుతోంది. కోలీవుడ్ లో తమిళ ఆర్టిస్టుల కు మాత్రమే అవ‌కాశం క‌ల్పించాల‌ని.. విదేశాల్లో షూటింగ్‌ల కు దూరంగా ఉండాలని.. ఫెఫ్సీ అధ్య‌క్షుడు.. త‌మిళ నిర్మాత RK సెల్వమణి కొత్త నిబంధ‌న‌లు పెట్ట‌డం పై ఇటీవ‌ల తెలుగు సినిమా 'బ్రో' ఈవెంట్లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమ‌ర్శించారు. క‌ళాకారుల‌ కు హ‌ద్దులు నియ‌మించ‌కూడ‌ద‌ని అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఆర్టిస్టుల కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ ని అన్నారు. అలా చేయ‌క‌పోతే టాలీవుడ్ నుంచి ఆర్.ఆర్.ఆర్- బాహుబ‌లి లాంటి చిత్రాలు వ‌చ్చేవి కావని కూడా అన్నారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌ ను తమిళనాడు నడిగరసంఘం అధ్యక్షుడిగా ఉన్న తమిళ నటుడు నాజర్ ఖండించారు. FEFSI చర్యలు తప్పుగా అన్వ‌యించ‌బడ్డాయని నాజ‌ర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులతో కూడిన తమిళ చిత్ర పరిశ్రమలో ఇటువంటి నిబంధనలు ఆచరణీయం కాదని ఆయన అన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇతర భాషల నటీనటుల ను ఎంటర్‌టైన్ చేయరని మీడియా లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఇదంతా త‌ప్పుడు స‌మాచారం అని నాజ‌ర్ అన్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి తీర్మానం చేస్తే దానికి వ్యతిరేకంగా గళం వినిపించే మొదటి వ్యక్తి నేనేనని ఇప్పుడు మనం పాన్-ఇండియన్ సినిమాల యుగం లో ఉన్నామని నాజ‌ర్ అన్నారు. ''తమిళ చిత్ర పరిశ్రమల కార్మికుల ను రక్షించేందుకు, తమిళ సినిమాల్లో తమిళ కార్మికుల కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని సెల్వమణి కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాణిశ్రీ - శార‌ద వంటి ప్ర‌ముఖ తార‌ల‌ ను త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో అక్కున చేర్చుకున్నారు. మనకు చాలా కాలంగా మంచి సంప్రదాయం ఉంది. కాబట్టి నా ప్రియమైన సోదర‌సోద‌రీమ‌ణులారా ఈ సమాచారాన్ని సీరియస్‌గా తీసుకోకండి. మేం కలిసి సినిమాలు తీస్తాము. వాటిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళతాము..'' అన్నారాయన.

'బ్రో' ప్ర‌చార ఈవెంట్లో 'ఫ్యాఫ్సీ' కొత్త నియ‌మ‌నిబంధ‌న‌లు స‌రికాద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యానించారు. బ్రో సినిమాలో ఉత్తరాది నుంచి ఊర్వశి రౌతేలా.. పాకిస్థాన్‌ నుంచి భారత్‌ కు వలస వచ్చిన నీతా లుల్లా వంటి వారికి అవ‌కాశాలు క‌ల్పించాం. ఇతర ప్రాంతాల కు చెందిన ప్రతిభావంతుల ను ప్రోత్సహిస్తున్నందున తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చిత్రాలను రూపొందించండి అంటూ కోలీవుడ్ కి ప‌వ‌న్ సూచించారు. ఈ వివాదం పై ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఇంకా స్పందించలేదు.