Begin typing your search above and press return to search.

SSMB29 మూవీ కోసం నాజర్ ఇలా..

బాహుబలి సినిమాలో బిజ్జలదేవుడిగా నాజర్ చేసిన విలనిజం అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   8 July 2024 12:13 PM GMT
SSMB29 మూవీ కోసం నాజర్ ఇలా..
X

సౌత్ లో సీనియర్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు నాజర్. అన్ని భాషలలో అతను సినిమాలు చేస్తున్నాడు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేయడం నాజర్ స్టైల్. అందుకే సుదీర్ఘకాలంగా ఆయన నటన ప్రస్థానం కొనసాగుతోంది. బాహుబలి సినిమాలో బిజ్జలదేవుడిగా నాజర్ చేసిన విలనిజం అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.

థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నాజర్ తరువాత సినిమాలలోకి ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉంటే నాజర్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న చేయబోయే సినిమా కోసం ట్రైనర్ అవతారంలోకి మారాడంట. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ వర్క్ షాప్స్ స్టార్ట్ చేస్తున్నారంట. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవుతారంట.

ఇక రాజమౌళి నిర్వహించబోయే మూవీ వర్క్ షాప్ కోసం నాజర్ ట్రైనర్ గా మారబోతున్నారంట. ముఖ్యంగా ఈ సినిమాలో సంభాషణలు పలికే విధానం, మాండలికంపై నాజర్ శిక్షణ ఇవ్వబోతున్నారంట. థియేటర్స్ ఆర్టిస్ట్ నుంచి కెరియర్ ప్రారంభించడంతో ఆయనకి డైలాగ్ వాచకం మీద మంచి పట్టు ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ని అర్ధం చేసుకొని ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన నాజర్ కి ఉన్నాయంట.

అందుకే రాజమౌళి SSMB29 సినిమాలో వర్క్ షాప్ కోసం అతనికి ట్రైనర్ గా పెట్టినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ బాబు మరో రెండు రోజుల్లో ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవుతారంట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆర్టిస్ట్స్ ని ఫైనల్ చేసే పనిలో జక్కన్న ఉన్నారంట. మహేష్ బాబు రెండు భిన్నమైన పాత్రలలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. ఎంఎం కీరవాణి కూడా ఈ సినిమా కోసం మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసారంట. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే దందర్భంగా ఆగష్టు 9న ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో రాజమౌళి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.