Begin typing your search above and press return to search.

న‌టాషాకు ఆ ఇద్ద‌రిలో న‌చ్చ‌నిది..!

ఇంత‌లోనే హార్థిక్ లోని రోమియో ల‌క్ష‌ణాల‌ను త‌ట్టుకోలేకే న‌టాషా ఇంత‌టి సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకుంద‌ని కూడా కొంద‌రు ఫ్యాన్స్ స‌మ‌ర్థించారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 9:30 AM GMT
న‌టాషాకు ఆ ఇద్ద‌రిలో న‌చ్చ‌నిది..!
X

కొంత కాలంగా న‌టాషా స్టాంకోవిక్ పేరు హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. హార్థిక్ పాండ్యా నుంచి న‌టాషా విడిపోతోంద‌ని తెలిసాక అభిమానులు త‌న‌ను చాలా ట్రోలింగ్ చేసారు. అదంతా అటుంచితే హార్థిక్ ఇప్పుడు వేరొక విదేశీ భామ‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.ఇంత‌లోనే హార్థిక్ లోని రోమియో ల‌క్ష‌ణాల‌ను త‌ట్టుకోలేకే న‌టాషా ఇంత‌టి సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకుంద‌ని కూడా కొంద‌రు ఫ్యాన్స్ స‌మ‌ర్థించారు.

మ‌రోవైపు న‌టాషా మొద‌టి ప్రేమ గురించి కూడా చాలా చ‌ర్చ సాగింది. నటాషా ఇంత‌కుముందు టీవీ హోస్ట్ కం న‌టుడు అలీ గోనీతో ప్రేమ‌లో ఉంది. అత‌డితో సీరియ‌స్ గా డేట్ చేసింది. కానీ ఈ బంధంలో కూడా ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. దానికి కార‌ణం అలీ గోని జీవితంలో జాస్మిన్ భాసిన్ ఉండ‌టం ప్ర‌ధాన కార‌ణం అని కూడా ప్ర‌చారం సాగుతోంది.

జాస్మిన్ భాసిన్ కంటే ముందు అలీ గోని నటాసా స్టాంకోవిక్‌తో శృంగార సంబంధంలో ఉన్నారు. వారు `నాచ్ బలియే` 9వ సీజన్‌లో కూడా కలిసి కనిపించారు. కానీ ప్రదర్శన ముగిసిన వెంటనే విడిపోయారు. అయితే వారు సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోలో నాచ్ బ‌లియేలో భాగమైనప్పుడు జాస్మిన్ భాసిన్ తో అలీ గోని రిలేష‌న్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక వీడియోలో జాస్మిన్ భాసిన్ తాను అలీ గోనీని ప్రేమిస్తున్నాన‌ని ఒప్పుకుంది.

తాజాగా రివీలైన వీడియో క్లిప్‌లో జాస్మిన్ అలీపై తన `షరతులు లేని ప్రేమ`ను అంగీకరించింది. నేను అతడిని ప్రేమిస్తున్నాను.. ఇది షరతులు లేని ప్రేమ‌.. అని వ్యాఖ్యానించింది. అదే స‌మ‌యంలో అలీ భయాందోళనకు గురవుతుండగా, జాస్మిన్ వ్యాఖ్యలకు నటాసా విసుగు చెందింది. ప్ర‌స్తుతం ఆ ముగ్గురూ ఉన్న వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

అలీ గోని నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయాడు. అతను తన గత సంబంధం గురించి మాట్లాడుతూ.. భారతీ సింగ్ -హర్ష్ లింబాచియా పోడ్‌కాస్ట్‌లో కనిపించాడు. నటాషా పేరు చెప్పనప్పటికీ.. తన కుటుంబంతో కలిసి జీవించకూడదనుకోవడం వల్ల త‌న మొద‌టి ప్రేయ‌సి నుంచి విడిపోయాన‌ని అలీ గోని పేర్కొన్నాడు. నా మునుపటి సంబంధం చాలా సీరియ‌స్. మేము విడిపోవడానికి కారణం .. విడిగా జీవించాల‌నే ఆమె కండీష‌న్‌! నేను దానికి అంగీకరించలేదు అని అలీ గోని చెప్పాడు. తాను ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని కుటుంబం నుంచి విడిపోయి దూరంగా ఉండ‌లేన‌ని కూడా అన్నాడు. న‌టాషా స్టాంకోవిక్ ఇటీవ‌ల క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. హార్థిక్ తో, అలీ గోనీతో న‌టాషా మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌కు కామన్ రీజ‌న్.. మ‌ధ్య‌లో మ‌రో యువ‌తి ప్ర‌వేశించ‌డ‌మేన‌ని ఈ విష‌యాలు చెబుతున్నాయి.