Begin typing your search above and press return to search.

న‌టాషా చేసిన ప‌నికి పాండ్య ఫ్యాన్స్ ఫైర్

డ్యాన్స్ చేస్తున్న పాట నుండి ఒక లైన్ తీసుకుంటూ- ''నువ్వు నా హోరిజోన్‌లో ఉన్న సూర్యుడివి'' అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   1 July 2024 6:12 AM GMT
న‌టాషా చేసిన ప‌నికి పాండ్య ఫ్యాన్స్ ఫైర్
X

హార్దిక్ పాండ్యా-నటాసా స్టాంకోవిక్ విడాకుల పుకార్లు గూగుల్ లో ట్రెండింగులో ఉన్నాయి. T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్‌లో భారతదేశం గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ సీక్రెట్ డ్యాన్సింగ్ వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైరల్‌గా మారింది. శనివారం నాడు ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు నటాషా తన జిమ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. డ్యాన్స్ చేస్తున్న పాట నుండి ఒక లైన్ తీసుకుంటూ- ''నువ్వు నా హోరిజోన్‌లో ఉన్న సూర్యుడివి'' అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది.

అయితే ఈ వీడియో మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే హార్దిక్ పాండ్యా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా వీడియో వైరల్‌గా మారింది. హార్దిక్ విజయాన్ని పురస్కరించుకుని నటాషా ఈ పోస్ట్‌ను షేర్ చేయలేదని లేదా సోషల్ మీడియాలో అతని మ్యాచ్ విన్నింగ్ మూవ్ మెంట్ చూసి స్పందించలేదని అభిమానులు గమనించారు. మ్యాచ్ లో హార్దిక్ విరుచుకుపడినా కానీ.. తర్వాత నటాషా కూడా సోషల్ మీడియాలో పెదవి విప్పలేదు. అయితే గత ఆరు నెలల్లో తన ప్రదర్శన కారణంగా తాను ఎదుర్కొన్న ట్రోల్స్, ఒత్తిడి గురించి విజ‌యానంత‌రం పాండ్య ఆవేద‌న‌గా మాట్లాడాడు.

హార్దిక్ మైలురాయి మూవ్ మెంట్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు న‌టాషాను ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. విడాకుల పుకార్లలో కొంత నిజం ఉందని చాలా మంది మౌనం వహించారు. విడాకుల పుకార్లను ప్రస్తావిస్తూ న‌టాషా ఒక్క కథనం కూడా పోస్ట్ చేయబడలేదు... కాబట్టి ఏదో నిజం ఉంద‌ని ఇప్పుడు నేను నమ్ముతున్నాను! అని సోషల్ మీడియా వినియోగదారు ఒక‌రు రాశారు. ''మీ వ్యక్తిగత జీవితంలో ఏం జ‌రుగుతోందో అన‌వ‌స‌రం. కానీ భారతదేశం మీకు అర్హత కంటే చాలా ఎక్కువ ఇస్తుంది. మీరు టీమ్ ఇండియా కోసం కొన్ని ఫోటోలను పోస్ట్ చేయాలి'' అని మరొక కామెంట్ లో రాసి ఉంది.

న‌టాషా త‌ర‌పున కూడా కొంద‌రు నెటిజ‌నులు మాట్లాడారు. వారి మధ్య ఏమి జరిగిందో మన‌కు తెలియదు. అది వారి వ్యక్తిగత ఎంపిక. తీర్పు చెప్పడానికి మనం ఎవరు? అని ఒక‌రు రాసారు. మనం ఒకరి పతనం సమయంలో వారిని ట్రోల్ చేస్తున్నాము.. వారిని ఏదో ఒక‌ సమయంలో ప్రశంసిస్తున్నాము.. ఇది మనల్ని మూర్ఖులని చేస్తుంది అని ఒక‌రు రాసారు. విడిపోవడాన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి ఆమెను ట్రోల్ చేయడం మానేద్దాం అని ఒక వ్యాఖ్యలో రాసారు.