బ్రేకప్ సైన్: స్వదేశానికి వెళ్లిపోయిన పాండ్యా వైఫ్ నటాషా
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, డ్యాన్సర్ నటాసా స్టాంకోవిక్ 31 మే 2020న క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకున్నారు.
By: Tupaki Desk | 17 July 2024 5:47 AM GMTనటాషా స్టాంకోవిక్ విమానాశ్రయంలో కనిపించింది. భర్త హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్ల నడుమ స్టాంకోవిచ్ మంగళవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో విమానం కోసం ఎదురు చూస్తూ కనిపించింది. మోడల్ కం నటి తన కుమారుడు అగస్త్యతో కలిసి విమానాశ్రయానికి వస్తున్నప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ సమయంలో నటాషా స్టిల్ ఫోటోగ్రాఫర్లను కూడా పట్టించుకోలేదు. కెమెరాలకు పోజులివ్వలేదు.. తన బ్యాగ్‌లను మోసుకుంటూ సీరియస్ గా వెళుతూ కనిపించింది.
ఆసక్తికరంగా ముంబైని వీడి వెళుతున్న ఫోటోని షేర్ చేసిన నటాషా ఇన్ స్టాలో విమానం -ఇంటి ఈమోజీలతో పాటు, `ఇది సంవత్సరంలో ఆ సమయం` అనే శీర్షికతో సూట్‌కేస్ ఫోటోని పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తన స్వస్థలమైన సెర్బియాకు తిరిగి వెళుతున్నానని హింట్ ఇచ్చింది. దీంతో నటాషా నిజంగానే హార్దిక్ ఇంటికి వీడ్కోలు పలుకుతోందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, డ్యాన్సర్ నటాసా స్టాంకోవిక్ 31 మే 2020న క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకున్నారు. ఈ జంట ఫిబ్రవరి 2023లో హిందూ - క్రైస్తవ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించారు. అయితే వారి విడాకుల పుకార్లు ఈ సంవత్సరం మేలో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాయి.
నటాషా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి `పాండ్యా` ఇంటిపేరును తొలగించినట్లు నెటిజన్లు గమనించిన తర్వాత బ్రేకప్ పుకార్లు మొదలయ్యాయి. తరువాత, నటాసా మరియు హార్దిక్ విడిపోయారా? అనే శీర్షికతో రెడ్డిట్ పోస్ట్ వైరల్ అయింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం లేదని రెడిట్ పోస్ట్ పేర్కొంది. IPL 2024 మ్యాచ్‌లకు నటాషా గైర్హాజరు కావడాన్ని నెటిజనులు సీరియస్‌గా ప్రశ్నించారు. ఆ తరువాత బాంబే టైమ్స్ తన కథనంలో హార్దిక్ -నటాషా వారి వైవాహిక జీవితంలో దాదాపు ఆరు నెలలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ``గత ఆరు నెలలుగా వారి వివాహంలో టెన్షన్ నెలకొంది. ఈ జంట విడిపోయే అవకాశం ఉంది. అయితే భరణం శాతం చుట్టూ కథలు ఊహాజనిత కథనాలు అతిశయోక్తిగా మారాయి``అని ఒక సోర్స్ తమకు వెల్లడించినట్టు బాంబే టైమ్స్ పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో కూడా నటాషా తన ఇన్స్టాగ్రామ్ లో పాండ్యా నుంచి విడిపోయిన పుకార్లను ధృవీకరించే వీడియోను పోస్ట్ చేసింది. ``నా నుండి మీకు మళ్ళీ ఒక సున్నితమైన రిమైండర్.. దేవుడు ఎర్ర సముద్రాన్ని తొలగించలేదు.. అతను దానిని విడిచిపెట్టాడు. అంటే అతడు మీ జీవితం నుండి ఒక సమస్యను తొలగించడు.. అతను దానిని అధిగమించగలడు`` అని నర్మగర్భంగా రాసింది. నటాషా తన కష్టాన్ని జీసస్ కి మొరపెట్టుకుంది.