నటాషాను పాండ్యా మోసం చేసాడా?
హార్దిక్ పాండ్యా- నటాసా స్టాంకోవిక్ జంట గత నెలలో విడిపోతున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 14 Aug 2024 3:50 AM GMTహార్దిక్ పాండ్యా- నటాసా స్టాంకోవిక్ జంట గత నెలలో విడిపోతున్నట్లు ప్రకటించారు. వారి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. బ్రేకప్ పై ఉమ్మడి ప్రకటన తర్వాత నటాషా సోషల్ మీడియా పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోసం, ఎమోషనల్ అబ్యూజ్ గురించి మాట్లాడే పోస్టులను నటాషా విపరీతంగా లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషపూరిత సంబంధాలపై కొన్ని పోస్ట్‌లను కూడా లైక్ కొట్టింది. ఇది ఈ జంట బ్రేకప్ కి కారణమైందనే ఊహాగానాలకు దారి తీస్తోంది.
ఒక రెడ్డిటర్ నటాషా వ్యవహారంపై వరుస స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి సమస్యను విఫులంగా చర్చించాడు. ``చీటింగ్ & ఎమోషనల్ అబ్యూజ్ గురించి నటాసా స్టాంకోవిక్ రీల్స్‌ను ఇష్టపడ్డారు`` అనే హెడ్డింగ్ తో ఈ పోస్టులు షేర్ అయ్యాయి. అయితే ఇవన్నీ ఇప్పటికి సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే. విడాకులకు గల కారణాలపై హార్దిక్ కానీ, నటాసా కానీ ఇప్పటికీ స్పందించలేదు.
హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన తర్వాత నటాసా స్టాంకోవిక్ ప్రస్తుతం తన స్వస్థలమైన సెర్బియాలో ఉంది. మే 2020లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఫిబ్రవరి 2023లో హిందూ - క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. జూలై 2024లో తమ బ్రేకప్‌ని అధికారికంగా ధృవీకరించారు. వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇది ఇద్దరికీ కఠినమైన నిర్ణయం అని పేర్కొన్నారు. తమ కుమారుడు అగస్త్యకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతామని వెల్లడించారు.
నటాషా - హార్థిక్ సోషల్ మీడియాలో ఇలా రాసారు. 4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత హార్థిక్, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం కలిసి మా వంతు ప్రయత్నం చేసాం. మా అన్నింటినీ ఇచ్చాము. ఇది(బ్రేకప్) మా ఇద్దరికీ మంచి ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతున్నాము. పరస్పర గౌరవం సాంగత్యంతో ఒక కుటుంబాన్ని పెంచాల్సిన సమయంలో ఇది కఠినమైన నిర్ణయం`` అని రాసారు. అగస్త్యకు మేం సహతల్లిదండ్రులుగా కొనసాగుతాము అని తెలిపారు. విడిపోయినప్పటికీ ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరిస్తూనే ఉన్నారు.