హార్థిక్ పుట్టినరోజున నటాషా ఇలా చేయాల్సింది కాదు!
అది కూడా హార్దిక్ పాండ్యా మొదటి పుట్టినరోజున ఎల్విష్ తో కలిసి నటాషా వైబ్‌ని క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 12 Oct 2024 5:40 AM GMTప్రేమ జంటల బ్రేకప్ కథనాలు.. భార్యాభర్తల విడాకుల ఫర్వాలు నిత్యకృత్యంగా మారాయి. సెలబ్రిటీ ప్రపంచంలోనే కాదు.. బయటి ప్రపంచంలోను ఇదే పరిస్థితి. దీనిపై చాలా ఆందోళన నెలకొంది. ఇటీవలే భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి హార్థిక్ పాండ్యా బ్రేకప్ ప్రకటన అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత తమ వారసుడు అగస్త్య కోసం ఆ ఇద్దరూ స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెర్బియా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన నటాషా తిరిగి బాలీవుడ్ లో బిగ్ కెరీర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. టీవీ మూవీ రంగంలో రాణించాలని కసిగా ముందుకు సాగుతోంది.
ఇంతలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఫేం ఎల్విష్ యాదవ్‌తో నటాసా స్టాంకోవిక్ ఒకే వేదికపై కనిపించింది. అతడి సరసన అందమైన నవ్వుతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. అది కూడా హార్దిక్ పాండ్యా మొదటి పుట్టినరోజున ఎల్విష్ తో కలిసి నటాషా వైబ్‌ని క్రియేట్ చేసింది. 'తేరే కర్క్' పాట కోసం ఎల్విష్ తో కలిసి నటాషా పెర్ఫామెన్స్ కి సంబంధించిన రీల్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. యాదృచ్ఛికంగా విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యాకు నిన్న మొదటి పుట్టినరోజు. పాండ్యాతో విడాకులు తీసుకున్న నటాసాకు ఇదే తొలి ప్రాజెక్ట్. యాధృచ్ఛికంగా ఇది హార్దిక్ పుట్టినరోజున నటాషా ఇలా చేయడంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఆసక్తికరంగా నటాషా షేర్ చేసిన వీడియోపై ఎల్విష్ ఇలా రాశాడు. ''హాన్ గైస్... యే కైసా లగా సర్ ప్రైజ్'' అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వీడియోలో నటాసా వైట్ ఫ్లవర్ ప్రింట్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్‌లో చాలా అందంగా కనిపించింది. ఎల్విష్ ఈ వీడియోను షేర్ చేసి, ''విబిన్, ఆన్ ఎ హోల్ న్యూ లెవెల్'' అని రాశారు. నటాసా -ఎల్విష్ ఈ రీల్‌ను రిలీజ్ చేయగానే ఫ్యాన్స్ స్పందించారు. ఒక నెటిజన్ 'అనుకోని భాయ్ ..' అని వ్యాఖ్యానించగా...భాయ్ పుట్టినరోజున నటాసా ఇలా ఎల్విష్‌తో కలిసి డిన్నర్ కోసం నగరంలో కనిపించింది.. అని రాసాడు.
మరోవైపు హార్దిక్ తన పుట్టినరోజు వేడుకల నుండి కేక్ కట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి, అతడు గతించిన సంవత్సరం గురించి ప్రస్థావించాడు. తన తప్పుల నుండి నేర్చుకుంటానని చెప్పాడు. లేఖలో ఇలా ఉంది. ''ఇది హెచ్చు తగ్గులతో నిండిన సంవత్సరం. పుట్టినరోజులు సానుకూలత, ఆశయాన్ని ప్రతిబింబించే సమయం. అందరి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. తప్పుల నుండి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం కొత్త ప్రేరణ'' అని రాసాడు. హార్దిక్- నటాషా ఒక ఉమ్మడి ప్రకటనలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. 4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత ఈ జంట విడిపోయింది. ఇప్పుడు ఎవరి దారిలో వారు కెరీర్ వేటలో బిజీగా ఉన్నారు.