Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లోకి అత‌డి మాజీని దించుతున్నారా?

అమెతో పాటు న‌టాషా ప్రియుడు అలెగ్జాండ‌ర్ అలెక్స్ ఇలిక్ ని కూడా సీన్ లోకి తేవాల‌ని చూస్తున్నారుట‌.

By:  Tupaki Desk   |   14 Sep 2024 7:35 AM GMT
బిగ్ బాస్ లోకి అత‌డి మాజీని దించుతున్నారా?
X

ఇండియా వైడ్ బిగ్ బాస్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో మొద‌లైన బిగ్ బాస్ ఇప్పుడు దేశ‌మంతా సంచ‌లనంగా మారింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీజ‌న్ 18కి రంగం సిద్ద‌మ‌వు తోంది. ప్రోమో..వీడియో కంటే ముందే కంటెస్టెంట్లు ఎవ‌రై ఉంటారు? అన్న ఉత్సాహం అంద‌రిలోనూ మొద‌లైంది.

బిగ్ బాస్ కి వ‌చ్చిన వారంతా ఏదో వివాదాస్ప‌ద‌మైన అయిన వాళ్లో...సోష‌ల్ మీడియాలో బాగా ఫేమ‌స్ అయితోనే త‌ప్ప ఎంపిక చేయ‌రు. ఛానెల్ టీఆర్పీని పెంచేది అదే కాబ‌ట్టి బిగ్ బాస్ కి ఎంపిక అవ్వాలంటే? అలా ఏదో సంచ‌ల‌నం అయి ఉండాలి. ఇటీవ‌ల శేఖ‌ర్ భాష తెలుగు బిగ్ బాస్ కి ఎంపిక అయ్యాడు అంటే కార‌ణం అందుకు అతుడు రాజ్ త‌రుణ్ -లావ‌ణ్య విష‌యంలో వేలు పెట్ట‌డంతోనే సాధ్య‌మైంది.

అంత‌కు ముందు అత‌డు యాంక‌ర్ గా మాత్ర‌మే ప‌నిచేసాడు. అంత ఫేమ‌స్ కూడా కాదు. కానీ రాజ్ త‌ర‌ణ్ వ్య‌వ‌హారంలో వేలు వేయ‌డంతో బాగా వెలుగులోకి వ‌చ్చాడు. స‌రిగ్గా ఇదే స్ట్రాట‌జీతో బాలీవుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా హార్దిక్ పాండ్య మాజీ భార్య న‌టాషా స్టాంకో విచ్ ని బిగ్ బాస్ 18 తీసుకోవాల‌ని చూస్తున్నారుట‌. దీనిలో భాగంగా నిర్వాహ‌కులు ఆమెకి ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అమెతో పాటు న‌టాషా ప్రియుడు అలెగ్జాండ‌ర్ అలెక్స్ ఇలిక్ ని కూడా సీన్ లోకి తేవాల‌ని చూస్తున్నారుట‌. ఇదే గ‌నుక జ‌రిగితే సీజ‌న్ 18 హీటెక్క‌డం ఖాయ‌మే. వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు, హార్దిక్ తో రిలేష‌న్ షిప్ ఎందుకు చెడింద‌న్న‌ది? కూడా బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని..ఇదే స్ట్రాట‌జీతో నిర్హాకులు వాళ్లిద్ద‌రికీ ట‌చ్ లోకి వెళ్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రేం జరుగుతుంద‌న్న‌ది చూడాలి.