మాజీకి దూరంగా కుమారుడి తో నటాషా ఇలా!
తాజాగా నటాషా-అతస్త్య లు బీచ్ లో బీచ్ లో ఆడుకుంటోన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 26 Aug 2024 8:30 PM GMTహార్దిక్ పాండ్యా- నటాషా విడిపోయిన సంగతి తెలిసిందే. అందుకు గల కారణాలు కూడా నిన్నటి రోజున నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ సంగతి పక్కన బెడితే బ్రేకప్ అనంతరం నటాషా కుమారుడు ఆగస్త్య ని తీసుకుని స్వదేశం సెర్బియాకి వెళ్లిపోయింది. మళ్లీ కొత్తగా జీవితాన్ని అక్కడ ప్రారంభించింది. ఇకపై అమ్మడి కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుంది? అన్నది తన సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
తాజాగా నటాషా-అతస్త్య లు బీచ్ లో బీచ్ లో ఆడుకుంటోన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టూపీస్ దూస్తుల్లో నటాషా మెరిసిపోతుంది. కుమారుడిని ఆడిస్తూ బీచ్ లో ఆస్వాదిస్తోంది. ఆగస్త్య లైఫ్ జాకెట్ ధరించి కళ్లకు అద్దాలు ధరించి కనిపిస్తున్నాడు. కుమారుడిని దగ్గరగా హత్తుకుని నటాషా తల్లి ప్రేమని పంచుతుంది. హార్దిక్- నటాషా విడిపోయిన తర్వాత కుమారుడితో నటాషా కనిపించడం ఇదే తొలిసారి.
ఇద్దరి మధ్య మనస్పర్దలు తలెత్తిన సమయంలో కుమారుడి టాపిక్ ఎక్కడా రాలేదు. భారతీయ చట్టాల ప్రకారం పిల్లాడు తల్లి దగ్గరే ఉండాలి. నటాషా విషయంలో అదే అమలవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం తల్లి సంరక్షణలో అగస్త్య ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 5 ఏళ్లు. మరో రెండేళ్ల అనంతరం ఎవరి దగ్గర ఉండాలి? అన్నది అగస్త్య నిర్ణయంపై అధారపడి ఉంటుంది.
అయితే భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంటుందని ఇద్దరూ ప్రకటించారు. ఇక హార్దిక్ నటాషా జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చే పనిలో ఉన్నాడు. ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు.