Begin typing your search above and press return to search.

ఎండ్రకాయ స్కర్ట్.. ఇదేం ఫ్యాష‌న్ గురూ?

టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లతోను ఫ్యాషన్ విద్యార్థులు అనుబంధం క‌లిగి ఉన్నారు. వీరంతా అద్భుత‌మైన క్రియేటివిటీతో ఆక‌ట్టుకున్నారు

By:  Tupaki Desk   |   2 July 2024 4:39 AM GMT
ఎండ్రకాయ స్కర్ట్.. ఇదేం ఫ్యాష‌న్ గురూ?
X

రొయ్య‌లు పీత‌లు తేళ్లు ఒంటిపైకెక్కితే ఇక అంతేగా... మ‌త్స్యం ఉన్న‌ట్టుండి రోడ్డుపై న‌డిచెల్లినా.. మ‌త్స్య‌క‌న్య రూపంతో మురిపించినా.. లేదా పార్క్ లో మొక్క‌లు, పురుగులు క్రిమి కీట‌కాల రూపంతో డిజైన‌ర్ లుక్కులో క‌నిపించినా.. అవ‌న్నీ సృజ‌కుల మ‌న‌సును క‌ళ్ల ముందు ఆవిష్క‌రిస్తాయి. నిఫ్ట్ లో చ‌దివి ఫ్యాష‌న్ డిజైన‌ర్లుగా రాణిస్తున్న ఎంద‌రో అనంత‌కోటి విశ్వంలో శ‌త‌కోటి ప్రాణుల‌ను, జీవ‌రాశుల నుంచి స్ఫూర్తి పొంది అద్భుత‌మైన క్రియేటివిటీని ఆవిష్క‌రిస్తున్నారు. వీరంతా నిజానికి చిత్ర‌సీమ‌తో అనుబంధం క‌లిగి ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లతోను ఫ్యాషన్ విద్యార్థులు అనుబంధం క‌లిగి ఉన్నారు. వీరంతా అద్భుత‌మైన క్రియేటివిటీతో ఆక‌ట్టుకున్నారు.

ఇప్పుడు అలాంటి ఒక క్రియేటివిటీ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్ర‌ముఖ న‌టి నటాషా పూనావల్లా తన తాజా దుస్తుల డిజైన్‌లో ఒక పెద్ద ఎండ్రకాయ(రొయ్య‌)ను ఇన్ స‌ర్ట్ చేయ‌డంతో.. అది కాస్తా చూప‌రుల‌కు సెన్సేష‌న్ గా మారింది. రొయ్య‌లు పీత‌లు న‌త్త‌లు శంకువుల‌తోను ఫ్యాష‌న్ ని ఎలా సృజించ‌వ‌చ్చే చేసి చూపించారు డిజైన‌ర్. తన తాజా ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ల‌తో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలిచే న‌టాషా ఈసారి కూడా హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది.

బోల్డ్ అండ్ డ‌స్కీ ఫ్యాష‌న్ సెన్స్ తో నటాషా మంత్రముగ్దులను చేసింది. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన మైసన్ స్కియాపరెల్లి కోచర్ షోకి అద్భుతమైన డెనిమ్- స్కర్ట్ లో యూనిక్ లుక్ తో క‌నిపించింది. ఈ ప్రత్యేకమైన రూపానికి సంబంధించిన వివరాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. మొదట నటాషా లగ్జరీ బ్రాండ్ షియాపరెల్లి స్ప్రింగ్ 2022 సేకరణ నుండి డెనిమ్ జాకెట్‌ను ఎంపిక చేసుకుంది. అయితే ఈ డిజైన‌ర్ జాకెట్ అద్భుతమైన శంఖాకార నిర్మాణాలతో ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది. ఇది టైమ్‌లెస్ డెనిమ్ ఫ్యాషన్‌లో క్లాసిక్ ట్విస్ట్ అన‌డంలో సందేహం లేదు. ఫుల్ స్లీవ్‌లు, స్టాండ్‌అవుట్ కాలర్లు ..గోల్డెన్ బటన్‌లతో జాకెట్ స్పెష‌ల్ గా కనిపించింది.

బ్రాండ్ 2024 స్ప్రింగ్ కలెక్షన్ నుండి తెల్లని ఎండ్రకాయల స్కర్ట్ ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఈ అద్భుతమైన స్కర్ట్ ఒక మెత్తటి డిజైన్‌ను కలిగి ఉంది. మధ్యలో ఒక పెద్ద ఎండ్రకాయలు మిడ్‌రిఫ్ భాగంలో హైలైట్ గా క‌నిపిస్తోంది. వావ్! వ్వాటే స్ట‌న్నింగ్ డిజైన్! అనేలా ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఈ డిజైన‌ర్ డ్రెస్ ఖ‌రీదు ఎంతో తెలుసా? తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్ముతాయి. దీని ఖ‌రీదు రూ. 9,00,000. ఈ అంద‌మైన‌ రూపానికి పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఆ పెదవుల మీదుగా అద్భుతమైన పీచు రంగును అద్దింది.