పసుపు చీరలో నేషనల్ క్రష్.. వ్వాటే లుక్స్!
చీరలో ఆమె ఫోటోలు చూస్తే మృదువైన అందంతో పాటు ఆత్మవిశ్వాసం తారాస్థాయిలో ఉంటుంది.
By: Tupaki Desk | 27 Nov 2024 5:06 PM GMTసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రష్మిక మందన్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. తాజాగా కోచి ప్రయాణంలో పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేస్తూ మరోసారి గ్లామర్ ట్రీట్ తో హైలెట్ అయ్యింది. ఈ చీరలో ఆమె అందం, ఆత్మవిశ్వాసం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మృదువైన కాస్ట్యూమ్స్‌తో, అందమైన జువెలరీతో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ పసుపు చీర రష్మిక అందాన్ని హైలైట్ చేస్తూ, ఆమెపై అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
రష్మిక మందన్నా కెరీర్‌ను కన్నడ సినిమా కిరాక్ పార్టీతో ప్రారంభించింది. అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన స్థానాన్ని బలపరిచింది. పుష్పలో 'శ్రీవల్లి' పాత్ర ఆమెకు నేషనల్ క్రష్ అని ట్యాగ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో కూడా గుడ్ బై మరియు మిషన్ మజ్ను వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో కుబేర మరియు హిందీలో చావా సినిమాలతో బిజీగా ఉంది.
రష్మిక అందం మాత్రమే కాదు, ఆమె ప్రతిభ కూడా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. చీరలో ఆమె ఫోటోలు చూస్తే మృదువైన అందంతో పాటు ఆత్మవిశ్వాసం తారాస్థాయిలో ఉంటుంది. ఈ లుక్‌తో రష్మిక "సింప్లీ ఏలిగెన్స్"కు నిర్వచనంగా నిలిచింది. ఆమె ప్రొఫెషనల్ కమిట్మెంట్, సోషల్ మీడియా యాక్టివిటీ ఆమెను యూత్‌కి మరింత దగ్గర చేసింది. రష్మిక తన ఫ్యాన్స్‌ను ప్రేమతో ఆప్యాయంగా అందుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది.
ఈ ఫోటోలకు ఆమె రాసిన క్యాప్షన్‌లో కూడా ఫ్యాన్స్‌పై ఆమె ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. "మీ ప్రేమ నన్ను ఆహ్లాదంగా ముంచెత్తింది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు" అంటూ ఆమె అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బిజీ షెడ్యూల్లో ఉన్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. యానిమల్ తో పాటు ఇతర పాన్ ఇండియా సినిమాలతో రష్మిక తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంటోంది. ఇక పుష్ప 2 తో ఆమె క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లే అవకాశం ఉంది.