Begin typing your search above and press return to search.

సైఫ్‌పై దాడి చేసినోడు జాతీయ స్థాయి రెజ్ల‌ర్?

అయితే దీనిని ఖండిస్తూ దుండ‌గుడి లాయ‌ర్ ఇంత‌కుముందు వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jan 2025 4:32 PM GMT
సైఫ్‌పై దాడి చేసినోడు జాతీయ స్థాయి రెజ్ల‌ర్?
X

సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి చేసిన దుండ‌గుడు బంగ్లాదేశ్ కి చెందిన పౌరుడు అని పోలీసులు గుర్తించిన సంగ‌తి తెలిసిందే. అత‌డు అక్ర‌మంగా భార‌త‌దేశంలో ఉంటున్నాడు. స‌రైన డాక్యుమెంట్లు లేకుండానే ఇక్క‌డ నివ‌శిస్తున్నాడ‌ని పోలీసులు వాదిస్తున్నారు. అయితే దీనిని ఖండిస్తూ దుండ‌గుడి లాయ‌ర్ ఇంత‌కుముందు వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అదంతా అటుంచితే దుండ‌గుడు విజ‌య్ దాస్ అలియాస్ మొహమ్మ‌ద్ ఇస్లాం గురించి షాకింగ్ విష‌యాలెన్నో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా ముంబై సెల‌బ్రిటీ ఫోటోగ్రాఫ‌ర్ వైర‌ల్ భ‌యానీ వెల్ల‌డించిన ఈ నిజం అంద‌రినీ నిశ్చేష్ఠుల‌ను చేస్తోంది. ఇది నిజంగా న‌మ్మ‌లేని కోణం. ఇంత‌కీ దుండ‌గుడి గురించి తెలిసిన కొత్త పాయింట్ ఏమై ఉంటుంది? అంటే....

సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ తాను బంగ్లాదేశ్ లో జాతీయ స్థాయి రెజ్లర్ అని చెప్పుకున్నాడట‌. జనవరి 19న థానేలో అరెస్టు అయిన తర్వాత తాను బంగ్లాదేశ్ లో జిల్లా, జాతీయ స్థాయిలో పోటీ పడ్డానని, తాను నైపుణ్యం కలిగిన రెజ్లర్ అని షెహజాద్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

అయితే అత‌డి వాద‌న‌లు నిజ‌మా కాదా? అన్న‌ది పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చాల్సి ఉంది. ఒక‌వేళ బంగ్లాదేశ్‌లో జాతీయ స్థాయి రెజ్ల‌ర్ అయితే అత‌డు భార‌త‌దేశంలో ఇంకా ఎలాంటి దారుణాల‌కు ఒడిక‌డ‌తాడో ఊహించ‌గ‌లం. ఒక రెజ్ల‌ర్ క్ర‌మిన‌ల్ అయితే అది మ‌రింత ప్ర‌మాదం అని ప్ర‌జ‌లు ఇంకా ఎక్కువ‌గా భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఈ బంగ్లాదేశీ దుండ‌గుడి వ్య‌వ‌హారం నెటిజ‌నుల్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది.