Begin typing your search above and press return to search.

జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు హ‌వా మ‌ళ్లీ?

అంధాధున్, దృశ్యం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో విజయవంతమైన చిత్రం-క్రూ.

By:  Tupaki Desk   |   2 April 2024 5:42 AM
జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు హ‌వా మ‌ళ్లీ?
X

కెరీర్ లో అత్యుత్త‌మ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ అవార్డు విజేత‌గా నిలిచింది సీనియ‌ర్ న‌టి ట‌బు. రెండు జాతీయ అవార్డులు, ఆరు ఫిలింఫేర్ లు అందుకున్నారు. ఉత్త‌రాది, ద‌క్షిణాదిన అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు సుప‌రిచితురాలైన ట‌బుకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ద‌శాబ్ధాలుగా త‌న‌దైన న‌ట‌న‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బహుముఖ ప్రజ్ఞ .. ఎంపిక చేసుకునే బలమైన స్త్రీ పాత్రలతోను ట‌బు పాపుల‌రైంది. ప్రస్తుతం ఈ వెట‌ర‌న్ బ్యూటీ 'క్రూ' ఘ‌న‌విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. ఈ చిత్రంలో తనదైన అద్భుత‌ నటప్ర‌ద‌ర్శ‌నకు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇందులో కృతి సనన్ , కరీనా కపూర్ ఖాన్‌లతో పోటీప‌డుతూ టబు డామినేష‌న్ కొన‌సాగించింది. వీళ్ల‌తో పాటు దిల్జిత్ దోసాంజ్, కపిల్ శర్మ, శాశ్వత ఛటర్జీ, కులభూషణ్ ఖర్బందా త‌దితరులు న‌టించారు.

క్రూలో జాతీయ ఉత్త‌మ న‌టి టబులో స‌రికొత్త కోణాన్ని చూశామ‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలలో టబు న‌ట‌న క‌డుపుబ్బా నవ్వించింది. ఇందులో గీత అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌తి పాత్ర‌లో న‌టించింది ట‌బు. ఈ పాత్ర‌లో త‌న‌దైన అద్భుత‌ నట‌న‌కు ప్రేక్ష‌కుల‌నుంచి చాలా ప్రేమను పొందుతోంది. అంధాధున్, దృశ్యం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో విజయవంతమైన చిత్రం-క్రూ. ఈ సినిమాలన్నీ టబు అద్భుత‌ నటన, మెస్మ‌రైజింగ్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసాయి. ట‌బులో విభిన్నమైన కోణాన్ని అభిమానులు ఆస్వాధించారు.

తాజాగా రిలీజైన 'క్రూ' భారీ విజ‌యం సాధించ‌డంలో ట‌బు పాత్ర విస్మ‌రించ‌లేనిది. ఈ సినిమా కేవ‌లం మూడు రోజుల్లో 62 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి సోమ‌వారం నాటికి 70 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ విజయంతో అభిమానుల్లో ట‌బు క్రేజ్ ఏ రేంజులో ఉందో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. వైవిధ్య‌మైన జాన‌ర్ల‌తో మెప్పించే ఏకైక బ్యాంక‌బుల్ నటి టబు అని చెప్పడంలో తప్పులేదు. ఈ విజ‌యాల‌తో త‌దుప‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌రోసారి సీనియ‌ర్ న‌టి ట‌బుతో నాయికా ప్ర‌ధాన చిత్రాల‌ను తెర‌కెక్కించే ప్ర‌ణాళిక‌కు బ‌లం చేకూరుతోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.