అలాగే ఉంటే బోరున ఏడ్చేసేవాళ్లం!
69వ జాతీయ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటీమణులు గా బాలీవుడ్ హీరోయిన్లు అలియాభట్..కృతిసనన్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Nov 2023 2:30 AM GMT69వ జాతీయ అవార్డుల్లో భాగంగా ఉత్తమ నటీమణులు గా బాలీవుడ్ హీరోయిన్లు అలియాభట్..కృతిసనన్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే ఉత్తమ నటీమణులుగా ఎంపికై ఇద్దరు సంచలనం సృష్టించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులందుకుని నవతరం నటులకు ఆదర్శంగా నిలిచారు. వాళ్లిద్దరి జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఓ గొప్ప అనుభూతి ఇది. తాజాగా ఆనాటి భావోద్వేగాన్ని అలియా మీడియాతో పంచుకుంది.
ఆనందం ఎక్కువైతో కొన్నిసార్లు నోట్లోంచి మాటలు రావు. ఆ సంతోషం కన్నీళ రూపంలో బయటప డుతుంది. ఆ క్షణాలు..నాకు కృతికి ఓ మరుపురాని జ్ఞాపకం. అవార్డు కార్యక్రమంలో వేదిక ఎక్కే ముందు కృతి నా ముందు నుంచుని ఉంది. నిన్ను ఓసారి కౌగిలించుకోవచ్చా? అని అడిగింది. వెంటనే నేను తనని హగ్ చేసుకున్నా. ఇద్దరం కాసేపు అలాగే ఉండిపోయాం. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాం.
ఆ క్షణం ఇద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంకాసేపు అక్కడే అలాగే ఉంటే బోరున ఏడ్చేసేవాళ్లం. అంతలా మా మనసులు కదిలిపోయాయి. ఇద్దరమ్మాయిల కల నెరవేరిన రోజు అది అంటూ అవార్డు అందుకోవడానికి ముందు జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరిలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దర్శకుడు సుకుమార్ ని హగ్ చేసుకుని ..తండ్రి అల్లు అరవింద్ ని కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యాడు.
ఇప్పటివరకూ ఏ తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోలేదు. తొలిసారి బన్నీకే అవార్డు దక్కింది. పుష్పచిత్రంలో పుష్ప రాజు పాత్రకు గాను ఆ అరుదైన గౌరవం దక్కింది.ఆ రకంగా తెలుగు సినిమా గౌరవాన్ని పెంచాడు. అప్పటివరకూ బన్నీ అంటే గొప్ప డాన్సర్ అనే పేరు వినిపించేది. పుష్ప రాజు పాత్ర నిజంగా అతని జీవితాన్నే మార్చేసింది. తనలో ఓ గొప్ప నటుడు ఉన్నాడని బయటపెట్టిన చిత్రమది.