జాతీయ సినిమా దినోత్సవానికి ఓ తేదీ ఉండదా?
తాజాగా 2023 లో అదే నేషనల్ సినిమా డే ని ' అక్టోబర్ 13'న నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
By: Tupaki Desk | 22 Sep 2023 5:17 AM GMTప్రతీ ఏడాది కొన్ని ప్రత్యేక తేదీలంటూ నిర్ణయించి బడి ఉంటాయి. పండుగలు.. ప్రముఖులు.. ప్రభుత్వాల కు సంబంధించి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ప్రత్యేకంగా కేటాయించిన ఆరోజు..తేదీల్లోనే ఘనంగా నిర్వహి స్తుంటారు. ఆగస్టు 15 అంటే స్వాతంత్య్రదినోత్సవం...అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి....సెప్టెంబర్ 5 అంటే ఉపాధ్యాయుల దినోత్సవం..జనవరి 12 నుంచి 16 తేదీల మధ్యలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటాం.
ఇలా ఏడాదిలో కొన్ని నెలల్లో ఆ తేదీల్లో ప్రత్యేకమైన పండగలు ఉన్నాయని ఓ గుర్తింపు ఉంది. ఆ తేదీకి అంతా సిద్దమై ఉంటారు. కానీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ తీసుకొచ్చిన 'నేషనల్ సినిమా డే' అనేదాన్ని ఎప్పుడు నిర్వహించాలో? అర్దం కాని డైలమా కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది నేషనల్ సినిమా డే సెప్టెంబర్ 23న నిర్వహించారు. ఆ ఒక్క రోజు కూడా కూడా తక్కవ ధరకే మల్టీప్లెక్స్ లో సినిమా వీక్షించే వెసులు బాటు ఎమ్ ఏ ఐ కల్పించింది.
తాజాగా 2023 లో అదే నేషనల్ సినిమా డే ని ' అక్టోబర్ 13'న నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో జనాల్లో కొత్త రకమైన గందరగోళం మొదలైంది. నేషనల్ సినిమా డే అంటే ఏడాదిలో ఒక నెలలో ప్రత్యేకమైన తేదీని నిర్ణయించి ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే పండుగ. మరి మల్టీప్లెక్స్ అసోసియేషన్ 2022 సెప్టెంబర్ లో నిర్వహించి..2023లో అదే పండగను అక్టోబర్ లో తేదీ మార్చి నిర్ణయించడం ఏంటి? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఒక నెల..తేదీ నిర్ణయించి ఏటా నిర్వహిస్తే దానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని..ఇలా ఏడాది కొసారి నెలలు..తేదీలు మార్చేసి నిర్వహిస్తే ఐడెంటిటీ ఎలా దక్కుతుందని ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రెయిజ్ చేస్తున్నారు. నేషనల్ సినిమా డే నిర్వహిస్తున్నారంటే? దానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేలా కార్యచరణ...కమిటీ నిర్ణయాలు ఉండాలని సూచిస్తున్నారు. ఇలా ఇష్టానుసారం ఏడాదిలో ఏదో ఒక నెలలో..ఏదో తేదీలో నేషనల్ సినిమా డే పేరిట నిర్వహణ అనేది తలొంపుగా ఉంటుందని అభిప్రాయా లు తెరపైకి వస్తున్నాయి.
వచ్చే ఏడాది నుంచైనా ఒకే నెల--ఒకేతేదీలో నిర్వహించాలని నెటి జనులు కోరుతున్నారు. వాస్తవానికి నేషనల్ సినిమా డే అనేది గతేడాది నుంచే మల్లీప్లెక్స్ అసోసియేషన్ అమలులోకి తెచ్చింది. సామాన్యులు మల్టీప్లెక్స్ కి దూరమవుతున్నారని ఒక్క రోజు టికెట్ ధరలు తగ్గించి నచ్చిన సినిమా చూపించి..మల్టీప్లెక్స్ అనుభూతి ఇవ్వాలన్నది ఆ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వెనుక మల్టీప్లెక్స్ బిజినెస్ స్ట్రాటీజీ కూడా ఉందని తెలుస్తుంది.