Begin typing your search above and press return to search.

ఏంటి.. ఇంకా పుష్ప-2 బ్రేక్ ఈవెన్ కాలేదా?

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఓవర్సీస్ లో పుష్ప-2 బ్రేక్ ఈవెన్ సాధించలేదని నట్టి కుమార్ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 8:10 AM GMT
ఏంటి.. ఇంకా పుష్ప-2 బ్రేక్ ఈవెన్ కాలేదా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప-2 రీసెంట్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత రోజుల్లో పుష్ప-2.. రేర్ ఫీట్ ను అందుకుందనే చెప్పాలి. ఎందుకంటే కొంతకాలంగా శతదినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలను మూవీస్ జరుపుకున్నట్లు వినే వినడం లేదు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప సీక్వెల్ ను భారీ స్థాయిలో నిర్మించగా.. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా రిలీజ్ కు ముందే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లు గానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ వేరే లెవెల్ లో అమ్ముడయ్యాయి. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని సత్తా చాటింది.

గతేడాది డిసెంబర్ 5వ తేదీన భారీ టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప-2.. ఆ తర్వాత ఫస్ట్ వీక్ లోనే రూ.1000 కోట్లకు పైగా రాబట్టి అదరగొట్టింది. రిలీజ్ అయ్యి 51 రోజులు అయినా ఇప్పటికే మంచి వసూళ్లు రాబడుతోంది. రీసెంట్ గా 20 నిమిషాలు యాడ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో లెక్క 1800 కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

నార్త్ బెల్ట్ ఆడియన్స్ మరింతగా రీలోడెడ్ వెర్షన్ కు కనెక్ట్ అయ్యారనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలా 51వ రోజు వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాత నట్టి కుమార్ ఇప్పుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆ సినిమా హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ అని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఓవర్సీస్ లో పుష్ప-2 బ్రేక్ ఈవెన్ సాధించలేదని నట్టి కుమార్ ఆరోపించారు. ఆయా ఏరియాల్లో ఎటువంటి లాభాలు రాలేదని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు, బన్నీ అభిమానులు.. స్పందిస్తున్నారు.

ఇక పుష్ప-2 విషయానికొస్తే.. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌ గా సందడి చేశారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ తో అలరించారు. తన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో మెప్పించారు. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.