Begin typing your search above and press return to search.

హిట్ 3లో లవ్ స్టోరీ కూడా..?

తన ప్రతి సినిమాతో కొత్త కంటెంట్ తో వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   22 March 2025 12:30 AM IST
Natural Star Nani HIT3
X

తన ప్రతి సినిమాతో కొత్త కంటెంట్ తో వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాని నెక్స్ట్ హిట్ సీరీస్ లో భాగంగా వస్తున్న హిట్ 3 తో వస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ 3 సినిమాలో నాని అర్జున్ సర్కార్ అంటూ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజైన హిట్ 3 టీజర్ నాని కెరీర్ లో మోస్ట్ వైలెంట్ యాంగిల్ ని చూపించేలా చేసింది.

ఇక హిట్ 3 సినిమాలో నాని సరసన కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. సినిమాలో ఆమె నాని లవర్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఐతే హిట్ 3 ట్రైలర్ చూడగానే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. ఐతే శైలేష్ ఈ టీజర్ లో చూపించని ఒక లవ్ స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది. లేటెస్ట్ గా సినిమా నుంచి తొలి సాంగ్ పోస్టర్ వదిలారు.

ఆ పోస్టర్ చూస్తుంటే శైలేష్ హిట్ 1, హిట్ 2 లో చూపించని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హిట్ 3లో చూపిస్తాడు అనిపించేలా ఉన్నాడు. హిట్ 3 సినిమా విషయంలో నాని కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా నాని లోని మాస్ విధ్వంసాన్ని చూపించేలా ఉంది. హిట్ 1 సినిమాలో విశ్వక్ సేన్, హిట్ 2 లో అడివి శేష్ నటించగా హిట్ 3 లో నాని తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

హిట్ ఫ్రాంచైజీలు ఇంకా కొనసాగించేలా శైలేష్ ప్లాన్ చేస్తున్నారు. అయితే హిట్ 2 తరహాలోనే హిట్ 3 చివర్లో హిట్ ఫోర్త్ కేస్ హీరో లీడ్ ఇస్తారా.. కథను కూడా ఏమైనా లీడ్ వదులుతారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి హిట్ 3 పై నాని చిన్నగా హైప్ ఎక్కించేస్తున్న టైం లో శ్రీనిధి శెట్టితో లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలిసి న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

నాని హిట్ 3 తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ తో కూడా నాని సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే నాని హిట్ 3 రిలీజ్ తర్వాత పూర్తిగా తన ఫోకస్ మొత్తం ప్యారడైజ్ మీద పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.