Begin typing your search above and press return to search.

1000 కోట్ల సక్సెస్ చూసిన హీరోయిన్.. ఇప్పుడు నాని కోసం

నాని సినిమాలంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్, కొత్త కంటెంట్ మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం కలిగింది. ప్రస్తుతం నాని తన తదుపరి ప్రాజెక్ట్ ‘హిట్ 3’ తో బిజీగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   2 Oct 2024 2:49 PM GMT
1000 కోట్ల సక్సెస్ చూసిన హీరోయిన్.. ఇప్పుడు నాని కోసం
X

నేచురల్ స్టార్ నాని కెరీర్‌ ఒక విజయవంతమైన దశలో కొనసాగుతోంది. రెగ్యులర్ గా కాకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్న ఈ టాలెంటెడ్ హీరో మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి మూడు వరుస విజయాలు సాధించి నిర్మాతల ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలతో నాని తనదైన మార్క్‌ని మళ్లీ నిలబెట్టుకున్నాడు.

నాని సినిమాలంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్, కొత్త కంటెంట్ మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం కలిగింది. ప్రస్తుతం నాని తన తదుపరి ప్రాజెక్ట్ ‘హిట్ 3’ తో బిజీగా ఉన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఇప్పటికే ‘హిట్’ సిరీస్ లో రెండు సినిమాలు విజయం సాధించాయి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హిట్’ మరియు అడవి శేష్ నటించిన ‘హిట్ 2’ మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

అయితే, ‘హిట్ 3’ లో నాని హీరోగా నటించడం వలన ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సిరీస్‌లో నాని నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో కంటెంట్ క్వాలిటీ లో ఎక్కడా తేడా ఉండదు అని చెప్పవచ్చు. ఇక ‘హిట్’ సిరీస్ కథలోని మిస్టరీ, ఉత్కంఠ ప్రేక్షకులను చివరి వరకు అట్టిపెట్టే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక నాని సరసన నటించే హీరోయిన్ విషయానికొస్తే, 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కేజీఎఫ్‌తో మంచి పాపులారిటీ సాధించినప్పటికీ, ఆ తర్వాత ‘కోబ్రా’ సినిమాలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, నాని వంటి స్టార్ హీరోతో జోడీగా నటించడం ఆమెకు మంచి అవకాశంగా మారవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుండగా, ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘హిట్ 3’ కోసం నాని, శ్రీనిధి కాంబినేషన్ సరికొత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో నాని నటనతో పాటు, ఈ సినిమాలో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ‘అ!’ వంటి ప్రయోగాత్మక సినిమాలు నిర్మించిన నాని, ఈసారి ‘హిట్ 3’ తో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో మరో సక్సెస్‌ను అందుకోవాలని కృషి చేస్తున్నాడు. మరి ‘హిట్ 3’ లో నాని ఏ విధమైన పాత్రలో కనిపిస్తాడో చూడాలి.