నేచురల్ స్టార్ తెలివైన ఆట!
తాజాగా ఈ ట్యాలెంటెడ్ నటుడు టాలీవుడ్ లో మరో తెలివైన గేమ్ ప్లాన్ చేసాడు.
By: Tupaki Desk | 4 April 2025 12:30 PMనేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో నే రేర్ పీస్. వారసుల ఇంపాక్ట్ ని సైతం తట్టుకుని నిలబడిన స్టార్. కేవలం ట్యాలెంట్ తో మాత్రమే పైకొచ్చిన నటుడు. చిరంజీవి, రవితేజ తర్వాత నాని గురించే గొప్పగా మాట్లాడుకునేది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ప్రయాణం స్టార్ వరకూ వచ్చాడంటే? అంతా తన కష్టం మీదనే. అందుకే నాని అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన గౌరవం.
తాజాగా ఈ ట్యాలెంటెడ్ నటుడు టాలీవుడ్ లో మరో తెలివైన గేమ్ ప్లాన్ చేసాడు. హిట్ ప్రాంచైజీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ పైనే వాటిని నిర్మిస్తున్నాడు. త్వరలో థర్డ్ కేసుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో తానే హీరోగా నటిస్తున్నాడు. అటుపై ఈ ప్రాంచైజీని మరింత మంది స్టార్ హీరోలతో కంటున్యూ చేసేలా ప్లాన్ చేసాడు. హిట్ పోర్త్ కేసులో హీరో కార్తీ అవుతాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
ఇదే ప్రాంచైజీ నుంచి ఐదారు సినిమాలైనా వస్తాయని డైరెక్టర్ శైలేష్ కొలను ప్రామిస్ చేసాడు. కానీ నాని మాత్రం హిట్ ప్రాంచైజీ నుంచి అన్ స్టాపబుల్ గా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. దేశంలో జరిగిన వివిధ రకాల సంఘటనలు, హత్యలను ఆధారంగా చేసుకుని ట్యాలెంటెడ్ దర్శకులందర్నీ పరిచయం చేయాలనుకుంటున్నాడట. క్రైమ్ జోనర్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసే ఈ నిర్ణయం తీసుకున్నాడట.
ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకోవడంలో నాని దిట్ట. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన అనుభవాన్ని సైతం రంగరించి బలమైన స్క్రిప్ట్ రాయించగలడు. సరిగ్గా ఇదే వ్యూహంతో 'ది ప్యారడైజ్' విషయంలోనూ ప్లాన్ చేస్తున్నాడుట. ప్యారడైజ్ రెండు భాగాలుగా ఉంటుందట. మొదటి భాగంలో నాని స్టార్ కాగా, రెండవ భాగంలో మరో కొత్త స్టార్ ని తెరపైకి తేవాలని చూస్తున్నాడట.
ప్యారడైజ్ కి నాని నిర్మాత కాకపోయినా అనధికారికంగా భాగస్వామిగా మారుతున్నాడట. శ్రీకాంత్ ఓదెల రెండు భాగాలుగా కథ రాయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంటే భవిష్యత్ లో దీన్ని కూడా ఓ యూనివర్శ్ లా క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు.