Begin typing your search above and press return to search.

నాని లైన‌ప్ డ‌బుల్ హ్యాట్రిక్ పై గురి!

నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు ఖాతాలో చేరుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2024 6:03 AM GMT
నాని లైన‌ప్ డ‌బుల్ హ్యాట్రిక్ పై గురి!
X

నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు ఖాతాలో చేరుతున్నాయి. ద‌స‌రా, హాయ్ నాన్న‌, స‌రిపోదా శ‌నివారంతో హ్యాట్రిక్ స‌క్సెస్ లు అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే త‌దుప‌రి ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టాడు. ప్ర‌స్తుతం హిట్ ప్రాంచైజీ నుంచి `హిట్ -3` లో న‌టిస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ ఓదెల‌తో రెండవ ప్రాజెక్ట్ గా మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. శైలేష్ కొల‌ను `హిట్` ప్రాంచైజీతో క్రైమ్ ఇన్వ‌స్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో తానో బ్రాండ్ అని నిరూపించాడు. అందుకే `హిట్ 3` లో నేరుగా నాని హీరో అయ్యాడు. అంత వ‌ర‌కూ ఆ ప్రాంచైజీకి నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి శైలేష్ ఎలాంటి ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌స్తాడు? అన్న దానిపై అభిమానుల్లో స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.

అటు శ్రీకాంత్ సెకెండ్ ప్రాజెక్ట్ పై అంత‌కు మంచి ఆస‌క్తి గా క‌నిపిస్తుంది. తొలి సినిమా `ద‌స‌రా`ని 70-80 కాలంలో వెళ్లి తెర‌కెక్కించాడు. ఇందులో నాని ని ఊర మాస్ పాత్ర‌లో కి తీసుకెళ్లాడు. నాని కెరీర్ లో ఓ మైల్ స్టోన్ చిత్రంగా చేసాడు. ఈ నేప‌థ్యంలో రెండ‌వ చిత్రం నేప‌థ్యం ఎలాంటిది? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. అయితే ఇది ఓ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని లీకులందుతున్నాయి. ఇది ఓ ప్ర‌త్యేక తెగ‌కు చెందిన స్టోరీగా వినిపిస్తుంది.

ఇందులో నాని ద‌స‌రాని మించి మాస్ లుక్ లో క‌నిపిస్తాడ‌ని అంచ‌నాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. కొంత వాస్త‌వ క‌థ‌ను తీసుకుని కల్పితాన్ని జోడించి తెర‌కెక్కిస్తోన్న చిత్రంగా వినిపిస్తోంది. ఈ క‌థ కోసం శ్రీకాంత్ ఏడాదిన్న‌ర పాటు ప‌నిచేసాడు. ఇంకే హీరో ఛాన్స్ తీసుకోక‌కుండా కేవ‌లం నాని కోస‌మే వెయిట్ చేసి మ‌రీ తెర‌కెక్కిస్తున్నాడు? అంటే కిక్కించే అంశాలు చాలా ఉంటాయ‌నే అభిమానులు గెస్ చేస్తున్నారు. మొత్తానికి నాని లైన‌ప్ చూస్తుంటే డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ రెండింటి షూటింగ్ ఆర్డ‌ర్ లో ప‌డిన త‌ర్వాత త‌దుప‌రి డైరెక్ట‌ర్ ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది.