Begin typing your search above and press return to search.

నాని భారీగా వరుస​ రిస్క్​లు.. అద్భుతం జరగాల్సిందే!

దసరా వంటి బిగ్గెస్ట్ హిట్​ తర్వాత నేచురల్ స్టార్ నానిపై మరింత అంచనాలు పెరిగాయి.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:30 PM GMT
నాని భారీగా వరుస​ రిస్క్​లు.. అద్భుతం జరగాల్సిందే!
X

దసరా వంటి బిగ్గెస్ట్ హిట్​ తర్వాత నేచురల్ స్టార్ నానిపై మరింత అంచనాలు పెరిగాయి. వాస్తవానికి ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. అప్పుడప్పుడు ఎక్స్​పెరిమెంట్స్​ కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడాయన వరుసగా భారీ రిస్క్​లు చేసేందుకు సిద్ధం అయిపోయారు. మరి అందులో నుంచి ఆయన సేఫ్​గా బయటపడతారా లేదా బోల్తా కొడతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

వివరాళ్లోకి వెళితే.. అష్టా-చమ్మా సినిమాతో అలరించినా, అంటే సుందరానికి! అంటూ నవ్వించినా, శ్యామ్‌ సింగరాయ్‌తో ఎమోషన్‌కు గురిచేసినా, దసరాతో ఎమోషనల్ విత్​​ వైలెన్స్ ఎక్స్​పెరిమెంట్​​ చేసినా.. అది హీరో నానికే చెల్లింది. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో.. ప్రస్తుతం కెరీర్​లో వైవిధ్యమైన పాత్రలతో ఎక్స్​పెరిమెంట్​ చేస్తూ ముందుకెళ్తున్నారు.

ప్రస్తుతం ఆయన హాయ్​ నాన్న అనే క్లాస్​ ఫిల్మ్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్​గా వివేక్ ఆత్రేయతో ఓ యాక్షన్ ఫిల్మ్​ అనౌన్స్ చేశారు. తమిళ దర్శకుడు డాన్​ ఫేమ్​ సిబి చక్రవర్తితోనూ ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఈ మూడు చిత్రాల రిజల్ట్​.. కేవలం కంటెంట్​, నాని బ్రాండ్​ మీదే ఆధారపడి ఉన్నాయి.

ఒక మాస్ ఫిల్మ్​ యావరేజ్ కంటెంట్​ ఉన్నా బాక్సాఫీస్​ వద్ద చెప్పుకోదగ్గ మంచి వసూళ్లను అందుకోగలదు. మంచి బిజినెస్ కూడా చేస్తుంది. కానీ క్లాస్ ఫిల్మ్స్​ అలా కాదు. సాంగ్స్​, ప్రోమోస్​, కంటెంట్​, యాక్టింగ్​ అన్నీ బాగా వర్కౌట్ అయితేనే మంచి టాక్ వస్తుంది. బిజినెస్ జరుగుతుంది. అయితే నాని ఒప్పుకున్న మూడు చిత్రాల దర్శకులకు ఆడియెన్స్​లో పెద్దగా గుర్తింపు, బ్రాండ్ ఏమీ లేదు. కాబట్టి ఈ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు.. కంటెంట్​, నాని బ్రాండ్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక ఈ చిత్రాలన్నీ హిట్​ అవ్వాలంటే ఏదో ఒక అద్భుతమే జరగాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే హీరో నాని పెద్ద రిస్కే చేయబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో.. ​