Begin typing your search above and press return to search.

నాని బిజినెస్.. ఏ లెవెల్లో ఉందంటే..

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా ఉండబోతోంది. శౌర్యువ్ ఈ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

By:  Tupaki Desk   |   3 Dec 2023 5:37 AM GMT
నాని బిజినెస్.. ఏ లెవెల్లో ఉందంటే..
X

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా నాని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమాలు చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. ఈ జెనరేషన్ లో ఫ్యామిలీ ఇమేజ్ ని తెచ్చుకున్న హీరోగా నాని మాత్రమే ఉన్నారని చెప్పాలి. అందుకే ఓటీటీలో కూడా నాని సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. డిసెంబర్ 7న నాని కొత్త మూవీ హాయ్ నాన్న థియేటర్స్ లోకి రాబోతోంది.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా ఉండబోతోంది. శౌర్యువ్ ఈ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం కంప్లీట్ అయిపొయింది. 29.6 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాపై జరిగిందని తెలుస్తోంది. దీనికంటే ముందు వచ్చిన దసరా కంటే ఈ సినిమాపై తక్కువ బిజినెస్ జరిగింది.

నాని చివరి ఐదు సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ చూసుకుంటే హైయెస్ట్ గా దసరా సినిమాకి జరిగింది. 50 ప్రీరిలీజ్ బిజినెస్ దసరా సినిమాపైనే జరిగింది. దానికి తగ'తగ్గట్లుగానే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. సెకండ్ హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ హాయ్ నాన్నకి జరిగింది. థర్డ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా అంటే సుందరానికి మూవీ నిలిచింది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. నాని గ్యాంగ్ లీడర్ మూవీపైన 28 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే శ్యామ్ సింగరాయ్ మూవీపైన 22 కోట్ల వ్యాపారం అయ్యింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. చివరి ఐదు సినిమాలలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్, ఒక ఏవరేజ్, ఒక డిజాస్టర్ మూవీ నాని ఖాతాలో చేరాయి. హాయ్ నాన్న రిజల్ట్ ఏంటి అనేది వారం రోజుల్లో తేలిపోనుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నారు. సినిమాపైనే పాజిటివ్ టాక్ నడుస్తోంది. యానిమల్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ తక్కువగా ఉండటంతో హాయ్ నాన్నకి కలిసొచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.