Begin typing your search above and press return to search.

నాని అంత చొర‌వ తీసుకుంటాడా?

ముక్కు..ముఖం తెలియ‌ని వారితో మూవ్ అవ్వ‌డం అన్న‌ది అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   7 Dec 2023 6:53 AM GMT
నాని అంత చొర‌వ తీసుకుంటాడా?
X

ముక్కు..ముఖం తెలియ‌ని వారితో మూవ్ అవ్వ‌డం అన్న‌ది అంత ఈజీ కాదు. అలా మూవ్ అవ్వాల న్నా..అలాంటి వారితో స్నేహం చేసేలా ఉండాల‌న్నా కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌నేవి ఉండాలి. రిజ‌ర్వర్డ్ గా ఉండే వాళ్లకిది అస్స‌లు సాధ్యం కాదు. కానీ నేచుర‌ల్ స్టార్ నాని మాత్రం ఆ టైపు కాదు అంటున్నాడు. ఆన్ సెట్స్ లోనూ కాదు ఆఫ్ ది సెట్స్ లోనూ నాని ఎంతో జోవియ‌ల్ ప‌ర్స‌న్ అని తెలుస్తోంది.

ఇప్ప‌టికే నానితో ప‌నిచేసిన హీరోయిన్లు అంతా నాని ఎంత సర‌దాగా ఉంటాడో రివీల్ చేసిన సంద‌ర్భా లెన్నో. నాని సినిమాలో హీరోయిన్లు అంటే అత‌ని ఇంట్లో మ‌నుషుల్లా మారిపోతారు. తాజాగా నానిలో మ‌రో రేర్ క్వాలిటీని కూడా బ‌య‌ట పెట్టాడు. ఎయిర్ పోర్టులో....ప్ర‌యాణాల్లో పెద్ద‌వాళ్లు పిల్ల‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటే? కాసేపు నేను చూసుకుంటాను..ఇటు ఇవ్వండని చిన్న పిల్ల‌లను త‌న చేతుల్లోకి తీసుకుని జోల పాడుతుంటాడుట‌.

'ఆ స‌మ‌యంలో వాళ్లు కూడా అంతే సౌక‌ర్యంగా ఉంటారు. నేను మాట్లాడాక పెద్ద వాళ్ల‌లోనూ ఇత‌డు మ‌న‌వాడే అన్న అభిప్రాయం కలుగుతుంది. 'జెర్సీ'లోనూ..'హాయ్ నాన్న' లోనూ చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి న‌టించా. చాలా స‌ర‌దాగా అనిపించింది. మా అబ్బాయి జున్ను న‌న్ను నాన్న అని పిలుస్తుంటాడు. త‌ను నాతో ఇంగ్లీష్ మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటే అస్స‌లు విన‌ను. ఆ త‌ర్వాత వాడే అర్దం చేసుకుని తెలుగులో మాట్లాడుతుంటాడు' అని అన్నారు.

ఒక‌ప్పుడు మ‌హేష్ ఎంతో రిజ‌ర్వ‌ర్డ్ గా ఉండేవారు. పిల్ల‌ల ఏడుపు శ‌బ్దం వినిపిస్తేనే అసౌక‌ర్యంగా ఫీలైన‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మ‌హేష్ జీవితంలో పెళ్లి..పిల్ల‌లు రావ‌డంతో ఆయ‌నలో ఆ రిజ‌ర్వ‌ర్డ్ నెస్ పోయింది. ఇప్పుడింకా అంద‌రితో చ‌నువుగా మెలుగుతున్నారు. సెట్స్ లో అంద‌రితో జోకులు వేయ డం...స‌ర‌దాగా సెటైర్లు వేయ‌డం..స్టేజ్ ల‌పై డాన్సులు చేయ‌డం ఇలా మ‌హేష్ చాలా మార్పుల‌న్నీ మ‌ధ్య‌లో వ‌చ్చిన‌వే.