Begin typing your search above and press return to search.

నాని రేంజ్ పెంచేలా ఆ సినిమా ప్లానింగ్..!

ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియన్స్ కు సరికొత్త కథలతో సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని

By:  Tupaki Desk   |   3 May 2024 4:02 AM GMT
నాని రేంజ్ పెంచేలా ఆ సినిమా ప్లానింగ్..!
X

సినీ పరిశ్రమలో స్టార్ అవ్వాలంటే టాలెంట్ తో పాటు కాస్త లక్ కూడా కలిసి రావాలి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. స్టార్స్ అంతా కూడా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ తెలుగు సినిమాల స్థాయిని పెంచుతున్నారు. ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియన్స్ కు సరికొత్త కథలతో సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే పరిశ్రమకు వచ్చిన నాని హీరోగా ఒక్కోమెట్టు ఎక్కుతూ న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు.

ఈమధ్య నాని కెరీర్ గ్రాఫ్ చూస్తే వరుస సూపర్ హిట్లతో అలా పైపైకి వెళ్తుంది. దసరా సినిమా ముందు వరకు నాని మాస్ సినిమాలు చేయలేడు అన్న అపోహ ఉండేది కానీ సరైన కథ వస్తే తను ఎలాంటి ప్రయోగాలైనా చేస్తానని ప్రూవ్ చేశాడు నాని. దసరా, హాయ్ నాన్న సినిమాలతో లాస్ట్ ఇయర్ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న నాని తన నెక్స్ట్ సినిమా సరిపోదా శనివారంతో వస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో నాని సినిమా లాక్ చేసుకున్నాడు.

డివివి దానయ్య నిర్మాణంలో సాహో డైరెక్టర్ సుజిత్ తో నాని సినిమా వస్తుంది. సరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా ఇదే. ఇన్నాళ్లు నూతన దర్శకులు, ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న వారితో పనిచేసిన నాని స్టార్ డైరెక్టర్ అది కూడా పాన్ ఇండియా డైరెక్టర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తప్పకుండా నాని కెరీర్ లో ఈ సినిమా సంథింగ్ స్పెషల్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు.

ఓజీ రిలీజ్ అవ్వడమే ఆలస్యం నాని సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్, స్క్రీన్ ప్లే అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. నాని కూడా సుజిత్ తో ఎప్పుడెప్పుడు పనిచేయాలా అని సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. సరిపోదా శనివారం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా వస్తుండగా నాని సుజిత్ సినిమా న్యాచురల్ స్టార్ రేంజ్ పెంచే సినిమాగా ఉంటుందని చెబుతున్నారు. దసరాతో 100 కోట్లు రీచ్ అయిన నాని రాబోయే సినిమాలతో మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.