నాని.. ఆ సినిమా ఆగిపోయినట్లే..?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు
By: Tupaki Desk | 17 Jun 2024 7:10 AM GMTనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ఆగష్టు 29న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సరిపోదా శనివారం ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో బలగం వేణు దర్శకత్వంలో నాని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాపై ఇదివరకే నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఎందుకనో ఇప్పుడు మూవీ క్యాన్సిల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నాని కోసం వేణు సిద్ధం చేసిన కథని పూర్తిగా పక్కన పెట్టేశారంట. కొత్త కథ ఏదైనా సెట్ అయితే మూవీ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. స్క్రిప్ట్ అవుట్ ఫుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో నిర్మాత దిల్ రాజు వేణు చెప్పిన కథని పక్కన పెట్టారంట.
కమెడియన్ వేణు బలగం సినిమాతో దిల్ రాజుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. 2 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 20+ కోట్లకి పైగా ప్రాఫిట్స్ అందించి రికార్డ్ సృష్టించింది. దిల్ రాజు తన సెకండ్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో రెండో సినిమా చేసే అవకాశం కూడా వేణుకి ఇచ్చాడు. వేణు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో దిల్ రాజు ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. నానికి కూడా వేణు చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పారు.
భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేయాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు మూవీ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వేణు ఓ కొత్త కథని రెడీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఆ కథపై కూడా నాని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మరో హీరో వద్దకు వెళ్ళే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదేలతో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో దసరా మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సారి అంతకు మించి పవర్ ఫుల్ కథాంశంతో శ్రీకాంత్ నానిని మెప్పించాడంట. వేణు ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో శ్రీకాంత్ తో చేయాలని అనుకున్న మూవీని ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో నాని ఉన్నారంట. త్వరలో దీనిపై స్పష్టమైన ప్రకటన రావొచ్చనే మాట వినిపిస్తోంది. సరిపోదా శనివారం రిలీజ్ తరువాతే నాని నెక్స్ట్ మూవీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.