Begin typing your search above and press return to search.

నాని లైనప్.. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్!

నాచురల్ స్టార్ నాని ఓ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:47 AM GMT
నాని లైనప్.. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్!
X

నాచురల్ స్టార్ నాని ఓ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారు అనేది బేరీజు వేసుకొని కథలని ఎంపిక చేసుకుంటున్నారు. అలా అని రెగ్యులర్ గా ఒకే జోనర్ లో మూవీస్ చేయడం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు టచ్ చేస్తున్న కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే కథలతోనే ప్రయాణం చేస్తున్నాడు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో 60-100 కోట్ల మధ్యకి తన మార్కెట్ ని నాని పెంచుకోగలిగాడు.

ఆగష్టు 29న నాచురల్ స్టార్ నాని నుంచి సరిపోదా శనివారం మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మాస్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తోన్న రెండో సినిమా ఇది. దీని తర్వాత నాని లైన్ అప్ చూసుకుంటే వరుసగా నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం.

సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాని నాని స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నాని తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించబోతున్నాడు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాని గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

దీని తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రెండో సినిమాని నాని చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. అయితే ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతోందనేది క్లారిటీ లేదు. SLV సినిమాస్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రం కూడా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీని తర్వాత బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో నాని సినిమా చేస్తానని అన్నాడు.

అయితే ఈ మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదంట. బలగం వేణుతో మూవీ చేస్తానని నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ అయితే హిట్ 3 సినిమాలను నాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందంట.