Begin typing your search above and press return to search.

లవ్ మౌళి.. 42 ముద్దులు.. టైటానిక్ సీన్!!

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది

By:  Tupaki Desk   |   3 Jun 2024 1:44 PM GMT
లవ్ మౌళి.. 42 ముద్దులు.. టైటానిక్ సీన్!!
X

టాలీవుడ్ యాక్టర్ నవదీప్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ హీరోగా చేసిన సినిమా లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వినూత్నమైన చిత్రాలకు అడ్డా అయిన సీ స్పేస్ నిర్మాణంలో రూపొందింది. అయితే ఈ సినిమా తన సెకండ్ ఇన్నింగ్స్ అని ప్రమోట్ చేస్తున్నారు నవదీప్. తన లవ్ స్టోరీలే లవ్ మౌళి చిత్రమని చెబుతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.

లవ్ మౌళి మూవీలో నవదీప్ పెయింటర్ గా కనిపించనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. మూవీలో కూడా అనేక బోల్డ్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. జూన్ 7వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల (145 నిమిషాలు) రన్ టైమ్ తో ఉంటుందని సమాచారం.

అయితే ఈ మూవీ ట్రైలర్ లో ఏడు లిప్ కిస్ సీన్లు ఉన్నాయి. సినిమాలో కూడా భారీగా ముద్దు సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీలో 25కి పైగా లిప్ కిస్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు లవ్ మౌళి చిత్రం.. 42 లిప్ లాక్స్ తో అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎవర్ గ్రీన్ మూవీ టైటానిక్ లో హీరోయిన్ న్యూ*డ్ గా ఉంటే.. హీరో పెయింటింగ్ వేసిన సీన్ గుర్తుందా? మూడు నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ లాంటి సన్నివేశమే లవ్ మౌళిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ డైలాగులు కూడా ఉన్నాయని సమాచారం. బోల్డ్ సీన్స్ లో వచ్చే ఆ డైలాగులకు థియేటర్లలో ఈలలు వేయడం పక్కా అని చెబుతున్నారు. ముఖ్యంగా ఓ మూడు డైలాగులు అయితే వేరే లెవెల్ అంట.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నవదీప్ సరసన పంఖురి గిద్వానీ నటిస్తోంది. స్నేహితురాలి రోల్ లో భావన సాగి యాక్ట్ చేసింది. గోవింద వసంత క్రేజీ మ్యూజిక్ అందించారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ మూడు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కానీ అనేక కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరో అయిదు రోజుల్లో సందడి చేయనుంది. మరి ఈ మూవీతో నవదీప్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.