అనగనగా ఒక రాజు షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్!
మధ్యలో యాక్సిడెంట్ వల్ల కొంచెం బ్రేక్ రావడం ఓకే కానీ ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత కూడా నవీన్ వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు.
By: Tupaki Desk | 28 Feb 2025 9:36 AM GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి తన ప్రైమ్ టైమ్ మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నుంచి మరో సినిమా వచ్చింది లేదు. మధ్యలో యాక్సిడెంట్ వల్ల కొంచెం బ్రేక్ రావడం ఓకే కానీ ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత కూడా నవీన్ వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు.
చేసిన ఒక్క సినిమా అయినా ఆడియన్స్ కు ఫుల్ లెంగ్త్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నవీన్ హీరోగా నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. కొత్త డైరెక్టర్ మారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
మెన్నా మధ్య నవీన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అనగనగా ఒక రాజు టీజర్ ను రిలీజ్ చేసింది. గొప్పలకు పోయే రాజు గారి పెళ్లి ఎలా ఉండబోతుందనే నేపథ్యంలో టీజర్ ను కట్ చేశారు. టీజర్ చాలా ఫ్రెష్ గా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. అప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను టీజర్ ఒక్కసారిగా పెంచేసింది.
నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా బజ్ వినిపిస్తుంది. మార్చి 2 నుంచి అనగనగా ఒక రాజు షూటింగ్ రాజమండ్రిలో జరగనున్నట్టు సమాచారం. ఒక వారం పాటూ అక్కడే ఈ షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననుంది. మార్చి 4న ఆమె పుట్టినరోజును కూడా మీనాక్షి అనగనగా ఒక రాజు సెట్స్ లోనే జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. 2025లోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. కాకపోతే ఎప్పుడనేది ఇంకా స్పష్టత రాలేదు.