నవీన్ చిప్స్ యాడ్.. శ్రీలీల డేట్ మ్యాటర్.. అన్ స్టాపబుల్ ట్రీట్!
సర్.. మీరు ఎమ్మెల్యే.. నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవీన్ పోలిశెట్టి.. బాలయ్యకు గిప్ట్ ఇస్తూ ప్రోమో స్టార్టింగ్ లోనే తెగ నవ్వించారు.
By: Tupaki Desk | 2 Dec 2024 10:36 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ఆడియన్స్ ను మెప్పించగా.. కొత్త ఎపిసోడ్ కు హీరోయిన్ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి గెస్టులుగా విచ్చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది.
సర్.. మీరు ఎమ్మెల్యే.. నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవీన్ పోలిశెట్టి.. బాలయ్యకు గిప్ట్ ఇస్తూ ప్రోమో స్టార్టింగ్ లోనే తెగ నవ్వించారు. ఆ తర్వాత వీణ వాయిస్తూ శ్రీలీల కనిపించారు. కుర్చీ మడత పెడితే క్లాసికల్ స్టైల్ లో ట్రై చేద్దామని నవీన్ అనగా.. అదిరపోద్దని బాలయ్య ఎంకరేజ్ చేస్తారు.
దాని కేమో మేకలిస్తవీ అంటూ నవీన్ పాట స్టార్ట్ చేయగా.. నా వీణ భరించలేకపోతుందని శ్రీలీల అంటారు. ఆ తర్వాత బాలయ్య.. శ్రీలీల, నవీన్ పాత ఆడిషన్స్ కోసం ప్రస్తావిస్తారు. చిప్స్ యాడ్ ఆడిషన్ లో తనను సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారని నవీన్ పోలిశెట్టి తెలిపారు. అసలు చిప్స్ తిన్నోడికి సిక్స్ ప్యాక్ ఎక్కడి నుంచి వస్తుందంటూ ఫుల్ గా నవ్వులు పూయించారు.
ఆ తర్వాత శ్రీలీల వోణీల పిక్ ను బాలయ్య స్క్రీన్ పై చూపించగా.. ఒక తోటలో అంటూ గంగోత్రి సాంగ్ ను స్టార్ట్ చేశారు నవీన్. శ్రీలీల ఎంబీబీఎస్ మూడేళ్ల కోర్సును మూడు సాంగ్స్ తో పోల్చారు. రియల్ లైఫ్ లో చిట్టి దొరికందా అని బాలయ్య అడగ్గా.. నవీన్ సిగ్గు పడుతూ నవ్వేశారు. ఆ తర్వాత ఓ ఫన్నీ గేమ్ లో జాతిరత్నాలు కోర్టు సీన్ గుర్తొస్తుందని అన్నారు.
డేట్ కు వెళ్లాలనుకుంటే.. ఏ యాక్టర్ తో వెళ్తావ్ అని శ్రీలీలను బాలయ్య అడగ్గా.. నన్ను నిజంగా అడుగుతున్నారా సర్ అని ఆమె నవ్వేశారు. ఆ తర్వాత తాము డేట్ కు వెళ్లామని నవీన్ చెప్పగా.. బాలకృష్ణ ముద్దు పెడతారు. అనంతరం బాలయ్య, నవీన్, శ్రీలీల.. రీసెంట్ గా వచ్చి దుమ్ముదులిపేస్తున్న పుష్ప-2లోని కిస్సిక్ పాటకు ముగ్గురూ కలిసి సరదాగా స్టెప్పులేశారు.
మొత్తానికి కొత్త ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవీన్ పోలిశెట్టి తన కామిక్ టైమింగ్ తో వేరే లెవెల్ లో అలరించనున్నారని కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. కొత్త ఎపిసోడ్ లో నవ్వులే నవ్వులు అని చెబుతున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.