డెవిల్ లో మార్పులు.. ఫస్ట్ డైరెక్టర్ నవీన్ ఏమన్నారంటే..
ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నవీన్ మేడారం కి డెవిల్ సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది?
By: Tupaki Desk | 21 Jan 2024 8:18 AM GMTడైరెక్టర్ నవీన్ మేడారం.. కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా రిలీజ్ సమయంలో ఇతని పేరు బాగా వినిపించింది. అందుకు కారణం డెవిల్ సినిమా దర్శకుడి విషయంలో నెలకొన్న వివాదమే. నవీన్ మేడారం దర్శకుడిగా అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా 'డెవిల్' సినిమాని అనౌన్స్ చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత షూటింగ్ మధ్యలో నుంచే దర్శకుడిగా నవీన్ మేడారంని తప్పించారు. ఈ విషయం టీజర్ బయటకు వచ్చినప్పుడు అందరికీ తెలిసింది.
టీజర్ లో 'ఏ ఫిలిం బై అభిషేక్ నామ పిక్చర్స్ టీం' అని ఉండడంతో మూవీ టీం నవీన్ మేడారం ని డైరెక్టర్ గా తీసేసారనే వాదనలు వినిపించాయి. తీరా సినిమా రిలీజ్ సమయానికి డెవిల్ కి నిర్మాత అయిన అభిషేక్ నామా దర్శకుడిగా మారిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో నవీన్ మేడారం సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.
అందులో 'డెవిల్' సినిమాకి మొదటి నుంచి తానే దర్శకుడినని, స్క్రిప్ట్ వర్క్ నుండి అన్ని తానే దగ్గరుండి చూసుకున్నానని, సినిమా కోసం 105 రోజులు కష్టపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక రిలీజ్ తర్వాత డెవిల్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇదిలా ఉంటే నవీన్ మేడారం నిర్మాతగా '90's' అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా ఈటీవీలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అందుకుంది.
ఒకప్పటి హీరో శివాజీ ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. 90's లో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. దీంతో సిరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నవీన్ మేడారం కి డెవిల్ సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది?
ఆ ప్రశ్నకి నవీన్ బదులిస్తూ.." నేను డెవిల్ సినిమా చూశాను. సినిమాలో ముందు అనుకున్న స్క్రిప్ తో పోలిస్తే కొన్ని మార్పులు చేశారు. ఇక అంతకుమించి సినిమా గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఇది 90's వెబ్ సిరీస్ కోసం పెట్టిన ప్రెస్ మీట్" అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇక 90'S వెబ్ సిరీస్ విషయానికొస్తే.. శివాజీ, వాసుకీ ఆనంద్‍తో, వసంతిక, రోహన్, స్నేహల్ కామత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య హసన్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం నిర్మించారు