Begin typing your search above and press return to search.

పొలిశెట్టి.. మరీ ఇంత టాలెంటెడ్ ఏంటి బ్రో..

తాజాగా ఆయన తన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా న్యూస్ యాంకర్ గా మారిపోయారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:13 AM GMT
పొలిశెట్టి.. మరీ ఇంత టాలెంటెడ్ ఏంటి బ్రో..
X

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడు హీరోగా మారారు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా అనుష్కతో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో కథతో పాటు, నవీన్ పొలిశెట్టి డైలాగ్ డెలివరీ టైమింగ్, ఆయన యాక్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అని చెప్పొచ్చు.

ఇక, వ్యక్తిగతంగానూ నవీన్ పొలిశెట్టి కి స్పాంటేనిటీ ఎక్కువ. సిట్యూవేషన్ ని బట్టి చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన తన సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా న్యూస్ యాంకర్ గా మారిపోయారు. నిజానికి ఈ మూవీ విడుదలై చాలా రోజులు అవుతోంది. హిట్ టాక్ తెచ్చేసుకుంది. వినాయకచవితికి కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ మూవీ వెనకపడకుండా ఉండేందుకు డిఫరెంట్ గా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

దీనిలో భాగంగా, వినాయక చవితి రోజున ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 తో కలిసి పనిచేశాడు. టీవీ9 న్యూస్ యాంకర్ అవతారం ఎత్తాడు. అచ్చం యాంకర్ లాగానే ఇంట్రో చెప్పాడు. ఆ తర్వాత లైన్ లో ఉన్న రిపోర్టర్ తో మాట్లాడేశాడు. అసలు ఎలాంటి అనుభవం లేకున్నా, ఏ మాత్రం తడపడకుండా యాంకరింగ్ చేశాడు. వార్తలు చక్కగా చదివాడు. ఆ రిపోర్టర్ తో మాట్లాడే క్రమంలోనూ తన చమత్కారాన్ని వదిలిపెట్టలేదు.

ఇక, న్యూస్ కూడా పార్లమెంట్ సమావేశాల గురించి కావడం విశేషం. ఈ వీడియో బైట్ ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కామెంట్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఇక, మీమ్స్ కూడా నువ్వే చేసుకో అన్న అంటూ కొందరు కామెంట్స్ చేయడం విశేషం. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ ఏంటి బ్రో అని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇక, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీ విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత అనుష్క సినిమా రావడంతో ఫ్యాన్స్ కూడా మూవీ చూడటానికి క్యూలు కడుతున్నారు. దానికి కూడా మూవీకి పాజిటివ్ వస్తుండటంతో, కాసుల వర్షం కురుస్తోంది. అనుష్క తో పాటు, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ మూవీకి సూపర్ ఫ్లస్ అయ్యాయి.