Begin typing your search above and press return to search.

నవీన్ పొలిశెట్టి.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు?

దీంతో నవీన్ తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయంతో పెద్ద నిర్మాతలు సైతం ఉన్నారు

By:  Tupaki Desk   |   14 July 2024 6:33 AM GMT
నవీన్ పొలిశెట్టి.. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు?
X

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే వెంటనే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అందరికి గుర్తుకొస్తాడు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో తనదైన టైమింగ్ తో కథలకి ప్రాణం పోస్తూ సక్సెస్ లు అందుకున్న ఈ యువ హీరోకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మంచి టాలెంటెడ్ యాక్టర్ అనే గుర్తింపు ఉంది. దర్శక, నిర్మాతలు కూడా నవీన్ పొలిశెట్టికి పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. నాని తర్వాత తనదైన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో నవీన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.

దీంతో నవీన్ తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయంతో పెద్ద నిర్మాతలు సైతం ఉన్నారు. అలాగే యంగ్ దర్శకులు అతనిని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేస్తున్నారు. కానీ నవీన్ సినిమాల ఎంపిక మాత్రం చాలా స్లో ఫేజ్ లో ఉంది. ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. లేట్ గా వచ్చిన బెస్ట్ కథతో రావాలనే థియరీని నవీన్ పొలిశెట్టి ఫాలో అవుతున్నాడు. ఇదే విషయాన్ని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు.

ఆ మూవీ సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి సితార ఎంటర్టైన్మెంట్స్ లో రెండు సినిమాలకి కమిట్ అయ్యాడనే ప్రచారం వినిపించింది. అనగనగా ఒక రాజు అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే అది అర్ధాంతరంగా ఆగిపోయింది. తరువాత అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఆ మూవీ స్టార్ట్ అవుతుందనే ప్రచారం బయటకొచ్చింది. దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే పెద్ద బ్యానర్స్ లో కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడంట.

గత ఏడాది ఏదో పనిమీద నవీన్ పొలిశెట్టి అమెరికా వెళ్ళాడు. తరువాత అక్కడ చిన్న ప్రమాదం జరిగిందనే టాక్ బయకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా వస్తాడని అందరూ భావించారు. అయితే ఆరు నెలలు కంప్లీట్ అయిన ఇప్పటి వరకు నవీన్ పొలిశెట్టి ఆచూకీ మీడియాకి దొరకలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా నవీన్ యాక్టివ్ గా లేడు. దీంతో నవీన్ ఏమైపోయాడనే ప్రశ్న వినిపిస్తోంది. హీరోగా నవీన్ ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేయగలిగే సామర్ధ్యం ఉంది.

చేతిలో అవకాశాలు కూడా ఉన్నాయి. కెరియర్ ని కరెక్ట్ గా బిల్డ్ చేసుకుంటే టైర్ 2 హీరోల జాబితాలో చేరే సత్తా నవీన్ కి ఉంది. అయిన ఈ కుర్ర హీరో సినిమా సినిమాకి సుదీర్ఘ విరామం తీసుకుంటూ ఉండటం వలన తనకున్న క్రేజ్ ని యూజ్ చేసుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. నవీన్ ఎప్పుడు ఇండియా వస్తాడు… సినిమా ఎప్పుడు చేస్తాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది.