పెళ్లి రూమర్ పై స్పందించిన జాతిరత్నం!
దీంతో తాజాగా ఈ ప్రచారంపై నవీన్ స్పందించాడు. 'ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలాంటి పని చేస్తే ముందుగా అందరికీ చెప్పే చేస్తాను. రహస్యంగా చేసుకోవాల్సిన అసవరం ఏముంది.
By: Tupaki Desk | 6 Aug 2024 12:31 PM GMTయంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వెండి తెరపై కనిపించి ఏడాది సమీపిస్తుంది. 'మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి' రిలీజ్ తర్వాత నవీన్ కొత్తసినిమా ప్రకటించలేదు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. రిలీజ్ అనంతరం అమెరికా వెళ్లిపోయాడు. దీంతో నవీన్ కొత్త సినిమా వివరాలేవి బయటకు రాలేదు. అంతక ముందు కూడా ఏడాది గ్యాప్ తీసుకున్నాడు.
'జాతిరత్నం' సక్సెస్ తో నటుడిగా పుల్ బిజీ అవుతాడనుకుంటే సినిమా చేయడానికి రెండేళ్లు పట్టింది. మరి ఈ గ్యాప్ అతడు తీసుకుంటున్నాడా? లేక వస్తుందా? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి. ఆ సంగతి పక్కనబెడితే అమెరికా లో ఉండిపోవడంతో లవ్ లో పడినట్లు కూడా మీడియలో ప్రచారం సాగింది. తాజాగా అమెరికా అమ్మాయిని లవ్ చేసి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు కూడా కొత్త ప్రచారం మొదలైంది.
సినిమాలు చేయకుండా అక్కడే ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరునట్లు అయింది. దీంతో తాజాగా ఈ ప్రచారంపై నవీన్ స్పందించాడు. 'ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలాంటి పని చేస్తే ముందుగా అందరికీ చెప్పే చేస్తాను. రహస్యంగా చేసుకోవాల్సిన అసవరం ఏముంది. పెళ్లి చేసుకుంటే అందరూ దీవించాలిగా' అన్నాడు. దీంతో సీక్రెట్ మ్యారేజ్ అనే ది ప్రచారంగానే తేలిపోయింది.
అయితే ఆమెరికా అమ్మాయితో లవ్ లో ఉన్నాడా? అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మరి యంగ్ హీరో అమెరికా నుంచి ఎప్పుడు తిరిగొస్తాడో? ఆ విషయం కూడా చెప్పలేదు. ఆ మధ్య చిన్నయాక్సిడెంట్ అవ్వడంతో చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఓ వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.