ఇప్పటికీ మహేష్ తో మాట్లాడుతూనే ఉంటాను
నిర్మలమ్మ ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏదో ఒక సందర్భంలో తరచు కలుస్తూనే ఉండేవాళ్లం
By: Tupaki Desk | 31 Aug 2023 3:57 AM GMTసూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రేమ చాలా ప్రత్యేకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సుదీర్ఘ కాలం పాటు కలిసి ఉన్నారు. విజయ నిర్మల చనిపోయిన సమయంలో ఆమె మరణం ను కృష్ణ తట్టుకోలేక పోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనం భరించలేక కృష్ణ చనిపోయారు అనేది సోషల్ మీడియాతో పాటు ఆ ఫ్యామిలీ వర్గాల్లో టాక్ వినిపించింది.
తాజాగా ఆ విషయాల గురించి విజయ నిర్మల మనవడు, నరేష్ తనయుడు అయిన నవీన్ మాట్లాడాడు. విజయ నిర్మలమ్మ చనిపోయిన సమయంలో ఆమెను మర్చిపోయేందుకు నాకు ఒక సంవత్సరం పట్టింది. అలాంటిది 40 ఏళ్లు ఆమెతో కలిసి ఉన్న కృష్ణ గారికి మరిచి పోవడం అంత ఈజీ కాదు. అందుకే ఎప్పుడు ఆమె జ్ఞాపకాల్లో ఉండేవారు.
నా సినిమా ఓకే అయిందని చెప్పాలనుకున్నా అప్పుడే నిర్మలమ్మ చనిపోయారు. నిర్మలమ్మ చనిపోయిన తర్వాత ఆ ఇంటి నుండి కృష్ణ గారిని మహేష్ బాబు గారు తీసుకు వెళ్లాలి అనుకున్నారు. కానీ 40 ఏళ్లు ఆ ఇంట్లో ఉన్న కృష్ణ గారు బయటకు వెళ్లి ఉండలేక పోయారు. ఆయన ఆ ఇంటిని వదిలి ఉండాలని అనుకోలేదు. ఆ ఇంటిని సడెన్ గా వదిలేయడం ఆయన వల్ల కాలేదు.
నిర్మలమ్మ ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏదో ఒక సందర్భంలో తరచు కలుస్తూనే ఉండేవాళ్లం. నిర్మలమ్మ పోయిన తర్వాత కూడా ఫ్యామిలీ అంతా కూడా పలు సందర్భాల్లో కలిశాం. ఇప్పటికి కూడా మహేష్ బాబు అన్న తో రెండు మూడు రోజులకు ఒక సారి ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాము.
రమ్య రఘుపతి ఒక వీడియో లో కృష్ణ గారిని అనాధ శవంలా వదిలేశారని ఆరోపించింది. ఆ ఆరోపణలు నిజం కాదని నవీన్ అన్నాడు. ఆయన పక్కన ఎప్పుడూ చాలా మంది ఉంటారు. కేర్ టేకర్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఉంటారు. కనుక ఆయన చనిపోయిన సమయంలో అనాధ శవంలా ఎందుకు ఉంటారని నవీన్ ప్రశ్నించాడు.