నరేష్-పవిత్ర పెళ్లి గురించి నవీన్ కామెంట్!
తాజాగా ఈ అంశాలపై నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
By: Tupaki Desk | 23 Aug 2023 6:21 PM GMTసీనియర్ నరేష్-నటి పవిత్రల రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. ఇద్దరు జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమా చేసి సంచలనం రేపిన వైనం అంతే ఆసక్తికరం. అటుపై మీడియా ఇంటర్వ్యూలు... ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలు షేర్ చేసుకోవడం వంటివి నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్లు సంచలన రేపాయి. తాజాగా ఈ అంశాలపై నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
'మా నాన్న గారు పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో ఎంతో మంది విమర్శించారు. ఒక కుమారుడిగా నేను మాత్రం ఆయన సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఏం చేయాలి ? అన్నది నాన్న గారికి తెలుసు. మనసుకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే కరెక్ట్ అని బలంగా నమ్ముతాను. నా వ్యక్తిగత జీవితంలో నేను అలాగే ఉంటాను. ఇక సోషల్ మీడియాలో కామెంట్లు రకరకాలుగా వస్తుంటాయి.
వాళ్లందర్నీ మెప్పించేలా..సంతృప్తి కలిగేలా బ్రతకడం అన్నది కష్టమైన పని. పవిత్ర లోకేష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె చాలా సైలెంట్. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు' అని అన్నాడు. నవీన్ వ్యాఖ్యల్ని బట్టి తండ్రి పెళ్లి విషయంలో తనకెలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక నవీన్ కెరీర్ సంగతి చూస్తే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రెండు..మూడు సినిమాల అనంతరం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.
కొన్నాళ్ల పాటు పరిశ్రమలో కనిపించలేదు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులకు గురైనట్లు ఇటీవల తెలిపారు. ఇటీవలే స్నేహితుడు..నటుడు సాయితేజ్ తో ఓ షార్ట్ ఫిలిం చేసాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇకపై తన జర్నీ కొత్తగా ఉంటుందని తెలిపాడు. దర్శకుడిగా పరిశ్రమలో రాణించాలని ఆశపడుతున్నాడు. నవీన్ మంచి ఎడిటర్ కూడా. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ తోనే ప్రశంసలు అందుకున్నాడు.