Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మ‌న‌వ‌రాలు.. CAT రాయ‌కుండానే..?!

అయితే ఈ అడ్మిషన్ చట్టబద్ధతను ప్రశ్నించిన కొంతమంది నెటిజన్లు ఆమె క్యాట్ రాసిందా లేదా? అని సందేహించారు.

By:  Tupaki Desk   |   3 Sept 2024 9:06 AM IST
మెగాస్టార్ మ‌న‌వ‌రాలు.. CAT రాయ‌కుండానే..?!
X

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఇటీవలే అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఎంబీఏ కోర్సులో చేరినట్లు ప్రకటించింది.


అయితే ఈ అడ్మిషన్ చట్టబద్ధతను ప్రశ్నించిన కొంతమంది నెటిజన్లు ఆమె క్యాట్ రాసిందా లేదా? అని సందేహించారు.


ప్రతిస్పందనగా నవ్య సోషల్ మీడియా ద్వారా సందేహాలను నివృత్తి చేసింది. కష్టపడి అంకితభావంతో IIMలో తన స్థానాన్ని సంపాదించాన‌ని నొక్కి చెప్పింది. ఆదివారం నాడు.. నవ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రవేశాన్ని ప్రకటిస్తూ వరుస ఫోటోలను షేర్ చేసింది. పలువురు ఆమెను అభినందించగా, కొందరు నెటిజన్లు ప్ర‌తిష్ఠాత్మ‌క ఇన్‌స్టిట్యూషన్‌లో చేరడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ఈ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించడానికి CAT రాసారా? అని ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించారు. మీరు IIMలో ఈ కోర్సుకు ఎలా అడ్మిషన్ పొందారు? ఈ ఇన్ స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందడం చాలా కష్టం అని మ‌రొక‌రు రాసారు.


అయితే నవ్య ఈ ట్రోల్స్‌పై గౌరవంగా స్పందించింది.``ఈయ‌న‌ ప్రసాద్ సార్... కోచింగ్ ఇచ్చి నన్ను CAT/IAT ప్రవేశ పరీక్షలలో విజ‌యం సాధించడానికి సిద్ధం చేయడంలో పెద్ద పాత్ర పోషించారు. అత్యుత్తమ ఉపాధ్యాయులలో ఒకరు అని రాసారు. నవ్య తనను సమర్థిస్తూ అభిమానులు షేర్ చేసిన వ్యాఖ్యలను కూడా లైక్ చేసింది.