Begin typing your search above and press return to search.

విల‌క్ష‌ణ‌ న‌టుడి 'హిజ్రా' అటెంప్ట్ వావ్ అనిపిస్తుందే!

న‌వాజుద్దీన్ హిజ్రా పాత్ర పాత్ర‌లో అక్ష‌య్ అజ‌య్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌డ్డీ' అనే సినిమా తెర‌కె క్కుతోంది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 2:48 PM GMT
విల‌క్ష‌ణ‌ న‌టుడి హిజ్రా అటెంప్ట్ వావ్ అనిపిస్తుందే!
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన 'తాలీ' వెబ్ సిరీస్ తో మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో ఏ రేంజ్ లో ఆక‌ట్టుకుందో తెలిసిందే. హిజ్రా ఆహార్యం స‌హా న‌ట‌నలో ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఓ న‌టి ఇలాంటి పాత్ర పోషించ‌డం పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. స‌రైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న సీనియ‌ర్ న‌టికి 'తాలీ' విజ‌యం గొప్ప బ్రేక్ నిచ్చింది. ఈ స‌క్సెస్ తో సుస్మితా సేన్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్న హోప్ క్రియేట్ అయింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖి అలాంటి ప్ర‌య‌త్నమే చేసారు. న‌వాజుద్దీన్ హిజ్రా పాత్ర పాత్ర‌లో అక్ష‌య్ అజ‌య్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌డ్డీ' అనే సినిమా తెర‌కె క్కుతోంది.

ఇందులో అమ్మాయిగా మారాల‌నుకునే హ‌రి పాత్ర‌లో న‌వాజుద్దీన్ క‌నిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. న‌వాజుద్దీన్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

హిజ్రా పాత్ర‌లో న‌వాజుద్దీన్.వివిధ కోణాల్లో అత‌ని ఆహార్యం..న‌ట‌న ప్ర‌తీది వావ్ అనిపించేలా ఉంది. అమ్మాయిగా లంగావోణీ..చీర ధ‌రించినా.. అబ్బాయిగా ప్యాంట్..ష‌ర్టు వేసినా హిజ్రా హ‌వ‌భావాల్లో ఎలాంటి మార్పులు ఉండ‌వ‌నిపించాడు. పాత్ర‌ని చాలా మాసివ్ గా తీర్చి దిద్దారు.

హిజ్రాల ప‌ట్ల సోసైటీ ఎలా ఉంటుంది? అమ్మాయిగా మార‌డానికి కార‌ణాలు ఏంటి? ఈ క్ర‌మంలో హ‌రి ఏం పోగొట్టుకున్నాడు? అత‌నికి జ‌రిగిన అన్యాయంపై తిరుగుబాటు? క‌క్ష‌పూరిత విధానం ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హ‌డ్డీని హైలైట్ చేస్తుంది.

ఎలాంటి అంచ‌నాలు లేని న‌టుడే ఇలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తే చూడాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. న‌వాజుద్దీన్ లాంటి పెర్పార్మ‌ర్ కి అలాంటి రోల్ క‌నిపించే స‌రికి హ‌డ్డీ పై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి. సెప్టెంబ‌ర్ 7న జీ5 లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అనంత‌రం 'హ‌డ్డీ' స‌క్స‌స్ అయితే మార్కెట్ లో ట్రాన్స్ జెండ‌ర్ క‌థ‌ల శ‌కం మొద‌లైన‌ట్లే. ఇలాంటి ప్ర‌య‌త్నాలు బాలీవుడ్ లో మ‌రిన్ని తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ట్రాన్స్ జెండ‌ర్స్ కి ముంబై అడ్డా. అదే అడ్డాలో కుటుంబాల‌కు దూరంగా ఉంటూ ఎంతో మంది చీక‌టి జీవితం గ‌డుపుతున్నారు. ఎన్నో క‌న్నీటి వ్య‌ధ‌లున్నాయి.