చైన్ స్మోకర్లు స్నేహితులైతే అంతే!
బాలీవుడ్ లో ఎంత మంది నటులున్నా? నవాజుద్దీన్ నటన మాత్రం ప్రేక్షకులకు యూనిక్ ఫీల్ ని అందిస్తుంది.
By: Tupaki Desk | 27 Jun 2024 11:30 PM GMTబాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కి వచ్చి సక్సెస్ అయిన నటుడు. విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. నేచురల్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోవడం నవాజుద్దీన్ ప్రత్యేకత. బాలీవుడ్ లో ఎంత మంది నటులున్నా? నవాజుద్దీన్ నటన మాత్రం ప్రేక్షకులకు యూనిక్ ఫీల్ ని అందిస్తుంది.
'సైంధవ్' సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు గానీ! నటుడిగా నవాజుద్దీన్ ఇక్కడ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. అతడి పెర్పార్మెన్స్ కి మును ముందు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో నవాజుద్దీన్ అతనికున్న ఓ వ్యసనం గురించి రివీల్ చేసాడు.
చాలా కాలం క్రితం నవాజుద్దీన్ స్మోకింగ్ బానిసైనట్లు తెలిపాడు. 'గంజాయి మత్తు నుంచి బయటకు రావడం తేలికైన పనికాదు. చైన్ స్మోకర్లగా ఉండే కొంత మంది స్నేహితులు ఉండేవారు. తరుచూ వాళ్లతో తిరిగేవా డిని. మొదట్లో స్మోకింగ్ అలవాటు ఉండేది కాదు. వాళ్లతో తిరగడం ప్రారంభమైన తర్వాత మెల్లగా అలవాటైంది. ఆ తర్వాత ఓ వ్యసనంలా మారింది. స్మోకింగ్ కంపెనీ ఉన్న వాళ్లతోనూ కొన్నాళ్లు స్నేహం చేసాను.
అది నన్ను మరింత ప్రభావితం చేసింది. కొన్నేళ్ల తర్వాత స్మోకింగ్ తప్పని నాలో నేనే రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి వాళ్లను దూరం పెట్టి మానడానికి ప్రయత్నించారు. మొదట్లో కష్టంగా ఉన్న కొన్ని నెలలకి ఆ మత్తు నుంచి బయట పడ్డాను. ఆ మత్తులో పొందే సంతోషం చాలా ఉంటుంది. కానీ అది తప్పు అని ఎంత వీలైంత అంత త్వరగా గ్రహించాలి. ఇలాంటి వాటి గురించి మాట్లాడినట్లు అయితే వాటిని ప్రచారం చేసినట్లు ఉంటుంది. అది కూడా తప్పే. అందుకు నన్ను అంతా క్షమించాలి' అని అన్నారు.