నాఫేస్ చూసి పేదోడు అనుకుంటారు కానీ!
వాచ్ మెన్ టూ స్టార్ అని నవాజుద్దీన్ లైఫ్ స్టోరీ రాస్తే చాలా సంగతులే బయటకు వస్తాయి.
By: Tupaki Desk | 30 Jun 2024 9:04 AM GMTబాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కి వచ్చి సక్సెస్ అయిన నటుడు. అయితే ఎదిగే క్రమంలో కటిక పేదరికం చూసాడు. వాచ్ మెన్ టూ స్టార్ అని నవాజుద్దీన్ లైఫ్ స్టోరీ రాస్తే చాలా సంగతులే బయటకు వస్తాయి. సినిమాల కోసం అష్టకష్టాలు పడ్డాడు. ఎన్నో అవమనాలు ఎదుర్కున్నాడు. తిండ్రి లేని రోజులు, నిత్రలేని రాత్రిళ్లు ఎన్నో గడిపాడు.
మరి నవాజుద్దీన్ మరి అంత కటిక పేదవాడా? అంటే కాదనే అంటున్నాడు నవాజుద్దీన్. 'నా ముఖం చూసి అంతా పేదవాడు అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నా కుటుంబం దగ్గర ఎలాంటి చీకు చింత లేకుండా బ్రతికేంత డబ్బు ఉంది. అలాగనీ మీతిమీరిన డబ్బు లేదు. ఓ ఫ్యామిలీకి కావాల్సిన వన్నీ ఏర్పాటు చేయగలదు నా కుటుంబం. నటుడిగా పనిచేయడానికి ముందు వాచ్ మెన్ ఉద్యోగం చేసాను.
తల్లిదండ్రుల వద్ద డబ్బు ఆశించ కూడదనే ఆ పని చేసాను. నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపిస్తామని చెప్పేవారు. ఏం చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? అనేవారు. కానీ సినిమాలో చాన్స్ వచ్చే వరకూ నా ఇబ్బందులేవి వాళ్లకి చెప్పకూడదనుకున్నా. అందుకే నాకు కాస్త ఆర్దిక బలం ఉన్నా! ఎవరికీ చెప్పకుండా నా పాటులు నేను పడి ఎదగడానికి ప్రయత్నించాను.
చిన్న పాత్రలు దక్కడంతో ఆర్దిక ఇబ్బందుల నుంచి బయట పడ్డా. ఆ తర్వాత ప్రధాన పాత్రల తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది` అని అన్నారు. విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు నవాజుద్దీన్. నేచురల్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోవడం నవాజుద్దీన్ ప్రత్యేకత. బాలీవుడ్ లో ఎంత మంది నటులున్నా? నవాజుద్దీన్ నటన మాత్రం ప్రేక్షకులకు యూనిక్ ఫీల్ ని అందిస్తుంది. సైంధవ్` సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.