Begin typing your search above and press return to search.

సౌత్ సినిమాలు.. అలా చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నా..!

రెండు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తున్న నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఈమధ్య సౌత్ సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   19 July 2024 6:18 AM GMT
సౌత్ సినిమాలు.. అలా చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నా..!
X

బాలీవుడ్ లో ఎలాంటి క్యారెక్టర్ కి అయినా సూటయ్యే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. చేస్తే హీరో లేదా విలన్ ఇలా చాలామంది ఉన్నారు కానీ లీడ్ రోల్ గా అయినా సపోర్టింగ్ రోల్ అయినా విలన్ గా అయినా సరే ఇచ్చిన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. రెండు దశాబ్దాల నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తున్న నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఈమధ్య సౌత్ సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకుంటున్నారు.

వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో ఆయన నటించారు. ఐతే సినిమా ఫలితం నిరాశ పరచడం వల్ల నవాజుద్ధీన్ సిద్ధిఖీ కి మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతం రామన్ రాఘవన్ సినిమాలో నటిస్తున్న ఆయన తన సౌత్ సినిమాల్లో నటించడానికి రెమ్యునరేషన్ ఒక రీజన్ అని చెప్పుకొచ్చారు. దక్షిణాది సినిమాల్లో పారితోషికం ఎక్కువ ఇస్తున్నారు. అందుకే ఇక్కడ సినిమాలు చేస్తున్నా అని అన్నారు నవాజుద్ధీన్ సిద్ధిఖీ.

ఐతే ఇచ్చినంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కానీ పాత్ర నియంత్రణలో తన ప్రమేయం లేనందుకు ఇబ్బందిగా ఉందని అంటున్నారు. నార్త్ సైడ్ సినిమాల్లో తన పాత్ర గురించి పూర్తి అవగాహనతో పట్టు సాధించి నటిస్తా కానీ సౌత్ సినిమాల్లో అది మిస్ అవుతుందని అంటున్నారు. ఇలా పాత్రని సరిగా అర్థం చేసుకోకుండా నటిస్తూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి తగిన న్యాయం చేయలేకపోతున్నా అనే ఉద్దేశంతో నవాజుద్ధీన్ సిద్ధిఖీ బాధపడుతున్నారు. ఐతే ఇక్కడ భాష మీద టచ్ లేకపోవడమే దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. మరి నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఈ స్టేట్ మెంట్ మేకర్స్ ని ఆలోచనలో పడేస్తుందని చెప్పొచ్చు.

నటిస్తున్న సినిమా చేస్తున్న సీన్ దాని గురించి పూర్తి అవగహాన ఉంటేనే అందుకు తగిన ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ చూపించగలరు. అలా కాకుండా నటిస్తున్న భాష తెలియకపోతే కచ్చితంగా నటులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సౌత్ సినిమాల్లో తన ఇన్ కన్వీనియన్స్ ను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. ఐతే అలా అని కూర్చోకుండా భాష నేర్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఈమధ్య సినిమాల కన్నా వెబ్ సీరీస్ లు చేస్తున్న నవాజుద్ధీన్ సిద్ధిఖీ త్వరలో రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది.