నవాజుద్దీన్ మాజీ భార్యపై దుబాయ్ ప్రభుత్వం వేటు!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి- అతని భార్య అలియా మధ్య వివాదాలు ఆ మధ్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే
By: Tupaki Desk | 9 Sep 2023 8:44 AM GMTబాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి- అతని భార్య అలియా మధ్య వివాదాలు ఆ మధ్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. నవాజుద్దీన్‌పై ఏకంగా అత్యాచారం కేసు కూడా పైల్ చేసింది అలియా. దుర్వినియోగం- అవిశ్వాసం - పిల్లల్ని తిరస్కరించడానికి వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి నానాయాగీ చేసింది. ప్రతిగా ఇద్దరు విడాకులతో వేరయ్యారు. ఆ తర్వాత ఆమె దుబాయ్ లో స్థిరపడింది.
అలాగే కొత్త బోయ్ ప్రెండ్ తో కొత్త జీవితం మొదలు పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఇది కేవలం ప్రచారం మాత్రమే అందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. అయితే తన జీవితంలో పిల్లలు కన్నా ఎవరూ ఎక్కువ కాదని చాలా సందర్భాల్లో అలియా తెలిపింది. ఇలా సంతోషంగా సాగిపోతున్న అలియా జీవితంలో దుబాయ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాజాగా అలియా పై దుబాయ్ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.
తన పిల్లల చదువుల కోసం దుబాయ్‌లో ఉన్న ఆలియాకు సెప్టెంబర్ 7న దుబాయ్ అద్దె వివాదాల అధికారులు ఎవిక్షన్ నోటీసును అందించారు. అలాగే అదనంగా దుబాయ్ ప్రభుత్వం నుండి బహిష్కరణ నోటీసు కూడా అందింది. ఆమె 27,183,00 దిర్హామ్‌లు చెల్లించడంలో విఫలమవ్వడంతో ఈనోటీసులు జారీ అయ్యాయి. ఆమె బహిష్కరణ చట్టపరమైన చర్యకు దారి తీస్తుంది.
ఇకపై అలియా దుబాయ్ లో ఉండాలంటే చట్టపరంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తర్వాతే అక్కడ ఉండటానికి అర్భురాలు అవుతుంది. లేదంటే ఇండియా తిరుగు ప్రయాణం తప్పదు. మరి ఈ వివాదంపై అలియా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక నవాజుద్దీని `సైంధవ్` సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించ నున్నారు. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి మాజీ భార్య దుబాయ్ బహిష్కరణపై ఆయన కామెంట్ ఏదైనా ఉంటుందా? అన్నది చూడాలి.