అల్లుడితో గొడవ సరే.. మామ రజనీ స్వీటెస్ట్ అనేసింది!
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య భర్తగా ధనుష్ సుపరిచితుడు.
By: Tupaki Desk | 13 Dec 2024 11:25 AM GMTఓవైపు స్టార్ హీరో ధనుష్‌తో కోర్టులో పోరాడుతోంది నయనతార. అదే సమయంలో ధనుష్ మామగారైన రజనీకాంత్ ని స్వీటెస్ట్ హ్యూమన్ (మధురమైన మానవుడు) అంటూ కితాబిచ్చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇన్‌స్టాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నయన్ ''వన్ అండ్ ఓన్లీ స్వీటెస్ట్ హ్యూమన్'' అంటూ పొగిడేసింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య భర్తగా ధనుష్ సుపరిచితుడు. ఇటీవలే ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో రజనీకాంత్ ని నయనతార స్వీటెస్ట్ అంటూ పొగిడేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రజనీకాంత్‌తో త్రోబాక్ ఫోటోను షేర్ చేసిన నయనతార... ఈ భూమిపై అత్యంత స్వీటెస్ట్ హ్యూమన్ అంటూ కీర్తించారు. మీరు ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిస్తున్నారు. మీ పుట్టినరోజు లక్షలాది మందికి ఒక వేడుక! మీ హృదయం కోరుకునేవి దేవుడు మీకు అందిస్తాడు.. అని నయన్ ఇన్ స్టాలో రాసారు.
రజనీకాంత్- నయనతార గతంలో శివాజీ, చంద్రముఖి, కుసేలన్ వంటి చిత్రాలలో జంటగా నటించారు. తన స్టార్ ని బర్త్ డే సందర్భంగా నయన్ ఇలా పొగిడేశారు. అయితే రజనీకాంత్ మాజీ అల్లుడు అయిన ధనుష్ తో నయన్ కోర్టులో పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'లో 2015లో ధనుష్ సినిమా తెరవెనుక ఫుటేజీని చేర్చినందుకు నయన్ పైనా, తన బృందంపైనా అతడు దావా వేసాడు. సమస్యను ప్రైవేట్‌గా పరిష్కరించడానికి పదేపదే ప్రయత్నించినా పరిష్కారం దొరకలేదని నయన్ అన్నారు.
నానుమ్ రౌడీ దాన్ సినిమాతోనే నయనతార- విఘ్నేష్ శివన్ జంట మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత ఆ ఇద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగులో ఉన్నారు. చివరిగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు.