Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎట్టకేలకు వారిని చూపించిన నయన్‌

చూస్తుండగానే నయన్‌, విఘ్నేష్ శివన్‌ ల కొడుకులు పెద్ద వారు అయ్యారు అన్నట్లుగా పిల్లలను చూసిన వారు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:50 AM GMT
పిక్ టాక్ : ఎట్టకేలకు వారిని చూపించిన నయన్‌
X

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఎట్టకేలకు తన కవల పిల్లల ఫోటోలను రివీల్‌ చేసింది. ఇటీవల తన భర్త విఘ్నేష్‌ శివన్ తో కలిసి కొడుకులతో కలిసి ఫోటో షూట్‌ తో సందడి చేసింది. ఇప్పటి వరకు కొడుకులకు సంబంధించిన ఫేస్ ను చూపించకుండా ఫోటోలు వీడియో లు షేర్ చేసిన నయనతార మొదటి సారి కొడుకు ల యొక్క ఫేస్ లను రివీల్‌ చేసింది.


విఘ్నేష్ శివన్‌ మరియు నయన్ ల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఫ్యాన్స్ వారి వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వారిని కొడుకులతో కలిసి చూడటం మరింత అందంగా ఈ జంట కనిపిస్తుంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చూస్తుండగానే నయన్‌, విఘ్నేష్ శివన్‌ ల కొడుకులు పెద్ద వారు అయ్యారు అన్నట్లుగా పిల్లలను చూసిన వారు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. వైట్‌ షర్ట్‌, బ్లాక్ పాయింట్ ధరించిన ఉయిర్‌ రుద్రోనిల్ ఎన్‌ శివన్ మరియు ఉలగ్ ధైవాగ్‌ ఎన్‌ శివన్‌ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

హీరోయిన్ గా నయనతార ఇటీవల జవాన్ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరో వైపు ఆమె నటించిన తమిళ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోయిన్ గా ఆమె ఎంత బిజీగా ఉన్నా కూడా కొడుకులకు సాధ్యం అయినంత ఎక్కువ సమయం కేటాయిస్తుంది. దర్శకుడిగా విఘ్నేష్ శివన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.