Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : హౌస్ లో ఆ ఐదుగురు డమ్మీ.. ఈ ముగ్గురు బెస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో 9వ వారం నయని పావని ఎలిమినేషన్ జరిగింది.

By:  Tupaki Desk   |   4 Nov 2024 5:28 AM GMT
బిగ్ బాస్ 8 : హౌస్ లో ఆ ఐదుగురు డమ్మీ.. ఈ ముగ్గురు బెస్ట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో 9వ వారం నయని పావని ఎలిమినేషన్ జరిగింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఆమెకే తక్కువ ఓట్స్ రాగా నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఐతే ఎలిమినేట్ అయిన నయని పావని తాను వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఎవరు డమ్మీ ఎవరు బెస్ట్ అన్నది చెప్పి వెళ్లింది. ఎలిమినేట్ అయిన నయనికి హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న వారిలో ఐదుగురు డమ్మీ ముగ్గురు బెస్ట్ ఎవరో చెప్పమన్నాడు.

ఐతే అప్పుడు నయని పావని రోహిణి, ప్రేరణ, విష్ణు ప్రియ, గౌతం, గంగవ్వ డమ్మీ ప్లేయర్స్ గా నిర్ణయించింది. ఇక ముగ్గురు బెస్త్ ప్లేయర్స్ లో హరితేజ, నిఖిల్, పృధ్విలను ఎంపిక చేసింది. ఐతే మిగతా వారేమో కానీ రోహిణి, ప్రేరణలతో నయని పవనికి హౌస్ లో చిన్నపాటి డిస్టబెన్స్ ఉన్నాయి కాబట్టే వాళ్లను డమ్మీ అనేసిందని చెప్పొచ్చు. అవినాష్ తో కలిసి రోహిణి ఎంటర్టైన్మెంట్ తో పాటు టాస్కుల్లో కూడా తన బెస్ట్ ఇస్తుంది.

మరోపక్క ప్రేరణ కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరు అంటే తనకు పడదు కాబట్టే నయని పావని వాళ్లని డమ్మీ ప్లేయర్స్ లిస్ట్ లో ఉంచింది. ఇక హరితేజని బెస్ట్ ప్లేయర్ గా ఉంచింది ఎందుకంటే హరితేజతో నయని హౌస్ లో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అందుకే హరితేజని బెస్ట్ గా పెట్టింది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 లో కేవలం వారానికే హౌస్ నుంచి బయటకు వెళ్లిన నయని పావని ఈసారి ఐదు వారాల దాకా ఉంది.

నయని పావని వెళ్తున్నప్పుడు హౌస్ లో ఎవరు అంతగా ఎమోషనల్ అవ్వలేదు. ఐతే హరితేజ మాత్రం ఆమెను చాలా మిస్ అవుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో 10వ వారం ఫ్యామిలీ వీక్ అని చెబుతున్నారు. ఈ వారం కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం 12 మంది హౌస్ మెట్స్ ఉన్నారు. టాప్ 5కి ఎవరు వెళ్లే అర్హత ఉంది అన్నది ఇప్పటికే ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఐతే టైటిల్ విన్నర్ రేసులో మాత్రం ఇంకా గట్టి పోటీ ఉన్నట్టు కనిపించట్లేదు. చివరి వారాల్లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి విన్నర్ డిసైడ్ అవ్వొచ్చు. ఇప్పటివరకైతే నిఖిల్ మాత్రమే విన్నర్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.