ఎట్టకేలకు సర్జరీ విషయంలో నోరు విప్పిన లేడీ సూపర్ స్టార్!
ఈ నేపథ్యంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది.
By: Tupaki Desk | 28 Oct 2024 3:30 PM GMTఅవసరం మేర హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లడం అన్నది సర్వసాధరణమైనది. మూతి..ముక్కు..పెదాలు...చిక్స్ వంటివి సర్జరీతో సరి చేసుకుంటుంటారు. గ్లామర్ ఫీల్డ్ లో పోటీని తట్టుకుని నిలబడాలంటే? రూప లావణ్యం పరంగా ఇలాంటివి తప్పవు. ఈ నేపథ్యంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తాజాగా ఈ అంశంపై నయన్ తొలిసారి స్పందించింది.
నా కనుబొమ్మలంటే ఎంతో ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తుంటాను. ప్రతీ రెడ్ కార్పెట్ ఈవెంట్ కి ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడు ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు. వాళ్లు అను కున్నది నిజం కాదు. అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంది.
మరోసారి అవే బుగ్గులు లోపలికి పోయి చిక్కిపోయినట్లు కనిపిస్తుంది. కావాలంటే మీరునన్ను గిచ్చి చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు. నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నేచురల్ సౌందర్యంతో బయట కనిపిస్తాను` అని అంది. ఓ మలయాళ చిత్రంతో నయన్ తెరంగేట్రం చేసింది. అప్పుడు చబ్బీలుక్ లో ఉండేది. ఆ తర్వాత ఫిట్ నెస్ ప్రీక్ గా మారి సన్నజాజి సోయగంలోకి ట్రాన్సపర్ అయింది.
ఆ తర్వత ముఖం సహా శరీరంలో చాలా రకాల మార్పులొచ్చినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని నెట్టింట ప్రచారం పీక్స్ కి చేరింది. దీంతో వాటిని ఇంత కాలం ఖండించ కపోయినా? ఇప్పుడు మాత్రం మీడియా ముందుకొచ్చి ఖండించింది.