సూపర్ స్టార్ అంటే తిట్టినట్లు అనిపిస్తుందట!
సాధారణంగా సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు నయనతార హాజరు అవ్వదు. కానీ తాజాగా నయనతార తన అన్నపూరణి చిత్రం కోసం మీడియా ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 10 Dec 2023 2:30 AM GMTనయనతార వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి భారీ విజయాలను నమోదు చేసుకోవడంతో పాటు, స్టార్ హీరోలకు జోడీగా కమర్షియల్ సినిమాల్లో కూడా నటించి మెప్పించడం ద్వారా అభిమానులు ఇంకా చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా వారు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కట్టబెట్టిన విషయం తెల్సిందే.
సాధారణంగా సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు నయనతార హాజరు అవ్వదు. కానీ తాజాగా నయనతార తన అన్నపూరణి చిత్రం కోసం మీడియా ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఒక లేడీస్ హాస్ట్ లో స్వయంగా భోజనం వడ్డించడం ద్వారా సినిమాకి మంచి ప్రమోషన్ దక్కేలా చేసింది.
అన్నపూరణి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తనకు జవాన్ సినిమా చాలా స్పెషల్ గా నిలిచిందని పేర్కొంది. ఆ సినిమా తర్వాత చాలా మంది నన్ను లేడీ సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారని కూడా నయనతార పేర్కొంది.
లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవడం పెద్దగా ఇష్టం ఉండదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా లేడీ సూపర్ స్టార్ అంటూ ఎవరైనా సంభోదిస్తే నన్ను తిడుతున్నారా అనిపిస్తుందని, వారు నన్ను తిడుతున్నారేమో అనిపిస్తుందని కూడా నయనతార చెప్పుకొచ్చింది.
అభిమానులు అభిమానంతో ఆ ట్యాగ్ ఇవ్వడంతో నిర్మాతలు, దర్శకులు సినిమాలో కూడా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని వినియోగిస్తున్నారు. దర్శక నిర్మాతల ఇష్ట ప్రకారం సినిమాలో లేడీ సూపర్ స్టార్ టైటిల్ కార్డ్ ను నయన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.